కోమటిరెడ్డి నేరుగా రాహుల్ తో…!.

టి అసెంబ్లీలో జరిగిన రగడకు శాసనసభ్యత్వాలను కోల్పోయి కోర్టు ద్వారా బయటపడిన కోమటి రెడ్డి, సంపత్ లు తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నుంచి ప్రశంసల జల్లు కురిసింది. టి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు కోమటిరెడ్డి, సంపత్ లు రాహుల్ ఆహ్వానం మేరకు 10 జనపధ్ వెళ్లారు. వారంతా హై కోర్టు తీర్పు కేసు , తమ పోరాటాన్ని అధినేతకు వివరించారు. టి నేతల విజయం పట్ల సంతృప్తి వ్యక్తంచేసిన రాహుల్ వారితో ఆనందం పంచుకున్నట్లు సమాచారం. కేసీఆర్ సర్కార్ కి వ్యతిరేకంగా తదుపరి ఎంతటి పోరాటాన్ని అయినా చేయాలని రాహుల్ సూచించినట్లు బయటకు వచ్చాక వెల్లడించారు నేతలు. ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చాక ప్రభుత్వం, స్పీకర్ స్పందించే తీరు చూసి ముందుకు సాగాలని రాహుల్ కోరినట్లు సమాచారం.

ఎన్నికలు నిర్వహణ అవవసరం లేదని ….

హై కోర్టు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు కోమటి రెడ్డి అండ్ టీమ్. తక్షణం టి సర్కార్ ఎన్నికలు నిర్వహించాలని పెట్టిన అభ్యర్ధన తీసేయాలని కోరారు . హై కోర్టు ఉత్తర్వుల వివరాలు ఎన్నికల సంఘానికి వీరు సమర్పించారు. తమ అభ్యర్థనకు ఎన్నికల సంఘం సానుకూల స్పందన తెలియచేసినట్లు టి కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలా ఢిల్లీ యాత్రను విజయవంతంగా ముగించారు కోమటిరెడ్డి అండ్ టీం. మరి రాబోయే రోజుల్లో టి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోనుందో దానికి ప్రతిగా కోమటి రెడ్డి ఎలాంటి పోరాటం చేస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*