బ్రేకింగ్ : కొండా దుమ్ము దులిపేశారు….!

konda couple may face troubles

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ కొండా దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముక్కుసూటిగా, నిర్మోహమాటంగా టీఆర్ఎస్ పై వారి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో తమ కుటుంబానికి ఎదురైన అవమానాలను, పార్టీలో జరుగుతున్న పరిణామాలను బయటపెట్టారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కొండా సురేఖ శనివారం మీడియాతో మాట్లాడుతూ….

– మేము పార్టీలో చేరడం హరీష్ రావుకు ఇష్టం లేదు. కానీ మంచికో చెడుకో తర్వాత హరీష్ రావు మా వెంట ఉన్నారు. కేటీఆర్ మాత్రం మా నియోజకవర్గంలో వర్గాలు ప్రోత్సహించి మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు.
– కేటీఆర్ కోటరీ తయారు చేసుకుంటున్నారు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన కోటరీలోని వ్యక్తులను మంత్రులను చేసుకుని తెలంగాణను ఇష్టారాజ్యంగా పాలించుకోవచ్చని కేటీఆర్ భావిస్తున్నారు. తనలాంటి ప్రశ్నించేవారు ఉంటే వారి ఆటలు నడవవనే కేటీఆర్ నన్ను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
– మొన్న ప్రకటించిన 105 మంది అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చే సత్తా కూడా టీఆర్ఎస్ కు లేదు. ఎన్నికల నాటికి ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికి టిక్కెట్లు ఇవ్వరు.
– 55 వేల మెజారిటీతో గెలిచిన బీసీ మహిళనైన నన్ను హోల్డ్ లో పెట్టడం అవమానకరంగా అనిపించింది. జిల్లాలో 11 మందిని ప్రకటించినా నా పేరును మాత్రమే ప్రకటించకపోవడానికి కారణం తెలియడం లేదు.
– గత ఎన్నికల్లో పరకాలలో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుంటే మూడు నెలల ముందు నుంచే తమను టీఆర్ఎస్ లో చేరాలని సంప్రదించారు. పరకాల ఇస్తేనే వస్తామన్నాం. కేసీఆర్ ఒత్తిడి చేసి మీరు తప్పితే సారయ్యను ఎవరూ ఓడించలేరని బతిలాడారు. 30 ఏళ్లుగా మా వెంట ఉన్న పరకాల నియోజకవర్గాన్ని వదిలినందుకు కళ్లల్లోకి నీళ్లు తీసుకున్నాను.
– కొత్తవాళ్లమైనా మేము ఊహించని రీతిలో వరంగల్ ఈస్ట్ ప్రజలు 55 వేల మెజారిటీతో గెలిపించారు. నాలుగేళ్లుగా వారి కోసమే, గతంలో ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేశాము.
– కులాలకు, మతాలకు అతీతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ పరకాల లాగానే ఈస్ట్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాను.
– టీఆర్ఎస్ లో చేరాక నేను చేసిన తప్పేంటి. వరంగల్ ఈస్ట్ లో పార్టీ నుంచి రూపాయి డబ్బు తీసుకోకుండా గెలిచాం. ఎంపీ ఉప ఎన్నికలు, కార్పొరేటర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మేమే ఖర్చు పెట్టుకుని గెలిపించుకున్నాం. నా నియోజకవర్గానికి సంబంధం లేకున్నా కేసీఆర్ చెప్పారని కాంగ్రెస్ క్యాంపు నుంచి ముగ్గురు జెడ్ పీటీసీలను తమవైపు తిప్పుకుని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ను గెలిపించాం.
– మహిళలు లేకుండానే తెలంగాణ వచ్చిందా..? పిల్లాపాపలను వదిలి బతుకమ్మలను, బోనాలతో ఉద్యమం చేయలేదా..? మరి మహిళలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు..?
– మహిళకు మంత్రి పదవి ఇవ్వకుండా చరిత్రలో నిలిచింది కేసీఆర్ ప్రభుత్వమే. నాకు హామీ ఇచ్చేనా మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. గతంలో తృణప్రాయంగా నేను మంత్రిపదవిని వదిలేసిన చరిత్ర నాది.
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా కొండా మురళీధర్ రావు గెలిచి మిగతా ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చారు.
– మాకు బీఫాంలు తప్పితే టీఆర్ఎస్ నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదు. అయినా క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఏనాడు పార్టీ గురించి మాట్లాడలేదు.
– అందరికీ టిక్కెట్లు ఇచ్చి, కేవలం ఎస్సీలు, బీసీలు, మహిళలకే టిక్కెట్లు నిరాకరించి కేసీఆర్ అన్యాయం చేశారు.
– పార్టీ గుర్తు మీద గెలిచిన మేము ఇవాళ కేసీఆర్ కు ఎందుకు చేదు అయ్యాము. ఎర్రబెల్లి దయాకర్ రావును ఎందుకు చంకలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఇది కుల రాజకీయాలు కాదా..?
– ఫిరాయింపుదారులకు టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్ నా టిక్కెట్ ఎందుకు ఆపారో 24 గంటల్లో చెప్పాలి.
– టిక్కెట్లు ఇచ్చిన క్యాండెట్ల సర్వే రిపోర్టులు కూడా బయటపెట్టాలి.
– అబద్ధపు హామీలు ఇతర పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. టీఆర్ఎస్ ను నమ్మి చేరిన వారు పునరాలోచించుకోవాలి.
– నిన్న సురేష్ రెడ్డిని చూస్తే పాపం అనిపించింది. గత ఎన్నికల్లో మా పక్కన కూడా కేటీఆర్ అలానే కూర్చుని ఇప్పుడు మోసం చేశారు.
– నేను రెండు టిక్కెట్లు అడిగానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. నేను ఒక్కటే టిక్కెట్ అడిగాను. అదికూడా నాకు మాత్రమే ఇవ్వాలని కేటీఆర్ కి, ఎంపీ సంతోష్ కి చెప్పాను.
– మా ఫోన్లు, డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మేము ఎక్కడ ఉన్నామో ఇంటెలిజెన్స్ తో రిపోర్టులు తెప్పించుకుంటున్నారు.
– మమ్మల్ని పొమ్మన్నలేక పొగబెడుతున్నారు.. నాకు టిక్కెట్ ఇవ్వకపోతే మేము రోడ్డుపై పడతామనుకుంటున్నారు. మేము ప్రజలను నమ్ముకున్నాం. ఇండిపెండెంట్ గానైనా గెలిచే సత్తా మాకుంది.
– తెలంగాణ ప్రజలు ఐదేళ్ల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, మంచి పాలన చేస్తున్నామనే నమ్మకం ఉంటే ముందుస్తుకు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారు..?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*