‘‘కీ’’ అన్నాచెల్లెళ్లేనా..!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ ముంద‌స్తు దూకుడు పెంచింది. గురువారం అసెంబ్లీని ర‌ద్దు చేసి.. శుక్ర‌వారం నుంచి ప్ర‌చారాన్ని మొద‌లు పెడుతోంద‌న్న‌ది దాదాపు డిసైడ్ అయ్యింది. సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్ నియోజ‌క‌వ‌ర్గంగా చెప్పుకునే ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా హ‌స్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఎన్నిక‌ల ప్ర‌చార‌భేరిని ప్రారంభించేందుకు సిద్ద‌మ‌వుతోంది. మ‌రోవైపు రాష్ట్ర అధికార యంత్రాంగం, ఎన్నిక‌ల యంత్రాంగం కూడా చ‌క‌చ‌కా ప‌నులు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో రాష్ట్ర సీఎస్‌తోపాటు ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ర‌జ‌త్‌కుమార్ భేటీ అయ్యారు. దీంతో అసెంబ్లీ ర‌ద్దు ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది.

అభ్యర్థులను ప్రకటిస్తూ……

ఇదిలా ఉండ‌గా.. 2019ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టిస్తున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ కాకుండా.. కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌, కూతురు, నిజామాబాద్ ఎంపీ క‌విత ప‌లువురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. సీఎం కేసీఆర్ కంటే ముందే అన్నాచెల్లెలు ప‌లువురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. హుస్నాబాద్‌లో నిర్వ‌హిస్తున్న ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ స్వ‌యంగా అభ్య‌ర్థుల తొలి జాబితాను విడుద‌ల చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే మంత్రి కేటీఆర్‌, ఎంపీ క‌విత‌లు ప‌లువురి పేర్ల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

కేటీఆర్ ఆయనకే సీటు అని…..

తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్ కామారెడ్డి అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే , ప్ర‌భుత్వ విప్ గంప గోవ‌ర్ధ‌న్ పేరును ప్ర‌క‌టించారు. అంతేగాకుండా.. ఆయ‌న‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కూడా పిలుపునిచ్చారు. ఇక జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా సంజ‌య్‌కుమార్ పేరును ఎంపీ క‌విత ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌దే గెలుపు అని ఆమె నిన్న ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో అన్నాచెల్లెల అనుచ‌ర‌వ‌ర్గం ఆనందంలో మునిగిపోతుండ‌గా.. ఇత‌ర‌వ‌ర్గాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. వీరికి అనుకూలంగా ఉన్న వారికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ద‌క్కుతాయ‌నే టాక్ అప్పుడే మొద‌లైంది.

హరీశ్ మాత్రం…….

పార్టీలో ప్ర‌ధానంగా మంత్రి హ‌రీశ్ రావు వ‌ర్గం కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో ఆయ‌న వ‌ర్గానికి చెందిన వారిలో చాలా మందికి ఈసారి టికెట్లు ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. హుస్నాబాద్ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించే మొద‌టి జాబితాలో ఎవ‌రి పేర్లు ఉన్నాయ‌నే దానిపై పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స‌తీశ్ పేరు ఖాయ‌మ‌ని తెలుస్తున్నా… మిగ‌తా వారు ఎవ‌ర‌నే దాని కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ జాబితాతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవ‌రికి టికెట్లు ద‌క్కుతాయో.. ఎవ‌రికి రావో ? తెలిసిపోతుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*