బ్రేకింగ్ : కుమార ఏకగ్రీవంగా….!

bharathiyajanathaparty vs indian national congress in karnataka

కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షను ఎదుర్కొన్నారు. బలపరీక్షకు ముందు కుమారస్వామి, బీజేపీ నేత యడ్యూరప్ప కూడా మాట్లాడారు. ఊహించినట్లే బీజేపీ వాకౌట్ చేసింది. బీజేపీ వాకౌట్ చేయడంతో కుమారస్వామి బలపరీక్షలో నెగ్గినట్లయింది.  బీజేపీకి మొత్తం 104 స్థానాలుండగా, కాంగ్రెస్ కు 78, జనతాదళ్ ఎస్ కు 37, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థు బలం ఉంది. సభ్యులంతా సభకు హాజరుకావడంతో స్పీకర్ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకోవడంతోనే కుమారస్వామి విజయం ఖాయమైంది. ఆ తర్వాత జరిగిన బలపరీక్ష కోసం కర్ణాటక శాసనసభలో కుమారస్వామి విశ్వాస తీర్మానం పెట్టారు. విశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా యడ్యూరప్ప ఆవేశంగా మాట్లాడారు. గతంలో కుమారస్వామితో కలసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానన్నారు. కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెబుతున్నానన్నారు. అధికారం కోసం కుమారస్వామి దిగజారారన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ లది అపవిత్ర కలయిక అని చెప్పారు.ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. 37 సీట్లు వచ్చిన జేడీఎస్ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. ప్రజాతీర్పును రెండు పార్టీలూ అవహేళన చేశాయన్నారు. కుమారస్వామి చరిత్ర అంతా తనకు తెలుసునన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కుమారస్వామిని చర్చలకు పిలిచి సిద్ధరామయ్యను అవమానపర్చిందన్నారు. యడ్యూరప్ప ప్రసంగాన్ని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, జేడీఎస్ నేత రేవణ్ణ అడ్డుకున్నారు. కుమారస్వామికి మద్దతిచ్చినందుకు డీకే శివకుమార్ ఎప్పటికైనా పశ్చాత్తాప పడతారన్నారు యడ్యూరప్ప. కాంగ్రెస్ లో ఉన్నంతకాలం శివకుమార్ సీఎం కాలేరని యడ్యూరప్ప చమత్కరించారు. కుమారస్వామి మాట్లాడుతూ కర్ణాటకలో పొత్తులతో ప్రభుత్వం ఏర్పడటం కొత్తేమీ కాదన్నారు. గతంలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. తన చరిత్ర సంగతిని పక్కనపెట్టి ఆయన చరిత్రను ఒకసారిచూసుకోవాలన్నారుకుమారస్వామి.బలపరీక్ష ఎదుర్కొనకుండాడనే కుమార స్వామి  ఎన్నిక లాంఛనమే. ఎన్నిక ఏకగ్రీవంగా మారనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*