“కుమార”కు ఆదిలోనే కష్టాలా?

bharathiyajanathaparty vs indian national congress in karnataka

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామికి ఆదిలోనే కష్టాలు తప్పడం లేదు. మంత్రి వర్గ కూర్పులో కాంగ్రెస్ పట్టు వీడటం లేదు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈ మేరకు ఫిట్టింగ్ ల మీద ఫిట్టింగ్ లు పెడుతున్నారు. రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టించి అవి తమకే ఇవ్వాలని కోరుతున్నారు. మరొకటి స్పీకర్ పదవి కూడా తమ పార్టీ అభ్యర్థికే ఇవ్వాలని షరతు పెట్టారు. అయితే కుమారస్వామి మాత్రం ఒక దానికి అంగీకరించడం లేదు. నిన్న ఢిల్లీ పర్యటనలో కుమారస్వామి బిజీబిజీగా గడిపారు.

రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు…..

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ తో సమావేశమైన కుమారస్వామి అనేక అంశాలపై చర్చించారు. అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంత్రి పదవులను కోరుకుంటోంది. అందులో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ముఖ్యమైనవి. ఇందులో ఒకటి లింగాయత్ వర్గానికి, మరొకటి దళితులకు ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అయితే దీనికి కుమారస్వామి అంగీకరించడం లేదని తెలిసింది. లింగాయత్ వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కుమారస్వామి ససేమిరా అంగీకరించడం లేదు.

స్పీకర్ పదవి కాంగ్రెస్ కే…..

అలాగే స్పీకర్ పదవి కూడా కాంగ్రెస్ కోరుకుంటుంది. దీనికి కుమారస్వామి అంగీకరించినట్లు సమాచారం. ఎప్పటికైనా భవిష్యత్తులో సమస్యలు తలెత్తితే స్పీకర్ పాత్ర కీలకంగా ఉండబోతోంది. కాబట్టి స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని కాంగ్రెస్ కొంత గట్టిగానే కోరినట్లు తెలుస్తోంది. మొదట్లో కొంత సంశయించినా కుమారస్వామి చివరకు స్పీకర్ పదవి ఇచ్చేందుకు అంగీకరించారని చెబుతున్నారు. అయితే దీనిపై నిన్న క్లారిటీ రాకపోవడంతో ఈరోజు మరోసారి మంత్రి వర్గ కూర్పుపై సమావేశం కానున్నారు. కాంగ్రెస్ కర్ణాటక ఇన్ ఛార్జి వేణుగోపాల్ నేతృత్వంలో స్థానిక నేతలతో కలసి కూర్చుని చర్చించుకుని పదవుల పందేరంపై ఒక క్లారిటీకి రావాలని రాహుల్ ఆదేశించారు. కుమారస్వామి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*