లగడపాటి మళ్లీ అటో..ఇటో…!!

lagadapati-rajagopal-survey-in-andhra-pradesh

లగడపాటి రాజగోపాల్ మళ్లీ అటో ఇటో అని లెక్క తేల్చారు. లగడపాటి చెబుతున్న లెక్క చూస్తుంటే చాలా తికమకగా ఉంది. ఆయన ప్రధానంగా టీడీపీకి జనం పట్టం కట్టింది రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులేనని తేల్చారు. మరి రాజధాని నిర్మాణం కేవలం కృష్ణా, గుంటూరు రెండు జిల్లాలకే పరిమితమయింది. పోలవరం ప్రాజెక్టు కూడా కేవలం నాలుగు జిల్లాల మేరకే ప్రభావం చూపుతుంది. లగడపాటి చెప్పిన విశ్లేషణ ప్రకారం చూస్తే రాజధాని నిర్మాణం ఆగిపోకూడదని, ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరగాలని ప్రజలు కోరుకున్నట్లు ఆయన చెప్పారు.

గందరగోళంగా…..

అయితే ఇక్కడ లగడపాటి ప్రకటించిన స్థానాల్లో సయితం కొంత గందరగోళంగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 72 నుంచి ఎనిమిది అటో ఇటో వస్తాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి వంద స్థానాలకు పది అటో ఇటో అని చెప్పారు. ఏపీలో ప్రభుత్వం నెలకొల్పాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 మాత్రమే. అంటే ఇక్కడ లగడపాటి తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పినా అటో ఇటో అనడమే మళ్లీ సందేహాలను కలగచేస్తుందంటున్నారు. తెలంగాణలో ఇచ్చిన స్పష్టత ఏపీలో లగడపాటి ఇవ్వలేకపోయారన్న వాదన విన్పిస్తోంది. అలాగే లోక్ సభ సీట్ల విషయంలో కూడా ఏపీలో అదే మాదిరిగా చెప్పారు. టీడీపీకీ పదిహేను ప్లస్ లేదా మైనస్ రెండు, వైసీపీకి పది నుంచి పన్నెండు సీట్లు రావచ్చని తేల్చారు. మొత్తం మీద లగడపాటి రాజగోపాల్ సర్వే కొంత గందరగోళంగానే కన్పిస్తంది. స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెబుతూ అటూ ఇటూ అని చెప్పడమే సందేహాలకు తావిస్తోంది. అలాగే లగడపాటి తాను ఈవీఎంలో తొంగి చూడలేదని, తప్పు కూడా కావచ్చని ఆయన అంగీకరించడం విశేషం.

Ravi Batchali
About Ravi Batchali 18771 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*