పూణెకు పొంచి వున్న ముప్పు …?

మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు వేడి వేడిగా సాగుతున్నాయి. తాజాగా తమకు రిజర్వేషన్లు విద్య ఉద్యోగాల్లో కావాలంటూ కొంత కాలంగా మరాఠాలు రోడెక్కి ఉద్యమాలు తారాస్థాయిలో సాగించేవారు. తొలుత శాంతియుత మార్గంలో సాగిన మరాఠా ఉద్యమం క్రమంగా విధ్వసం దిశగా నడిచింది. పెద్దఎత్తున రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ వేలాదిమంది ముంబాయి,పూణే వంటిచోట్ల భారీ హింసాకాండ చెలరేగేలా చేశారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు.

పూణే టార్గెట్ గా …

నిఘావర్గాల కు అందిన సమాచారం మేరకు మరోసారి ఉద్యమం పేరుతో విధ్వంస కాండ జరగబోతుంది అని. ఈ నేపథ్యంలో ఈ ఆందోళన అణచివేయాలని మహారాష్ట్ర సర్కార్ భావిస్తుంది . ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో ఫడ్నవిస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వేలసంఖ్యలో పూణే లో భద్రతా బలగాలను మోహరింప చేసింది. ఎలాంటి విధ్వసం చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది.

ఇప్పుడు కేసులు వెత్తివేయాలంటూ …

గతంలో రిజర్వేషన్లు కోసం రోడ్డెక్కిన సందర్భంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలంటూ ఆందోళన ప్రారంభించనున్నారు మరాఠా ఉద్యమ కారులు. సకల మరాఠా మోర్చా, మరాఠా క్రాంతి మోర్ఛాలు నేతృత్వంలో భారీ ఉద్యమానికి రంగం సిద్ధం చేశారు. అయితే ఈ ఉద్యమం ప్రారంభమైతే పెద్ద ఎత్తునే హింస చెలరేగుతుందన్న సమాచారంతో ముందస్తు చర్యలు తీసుకుంటుంది ఫడ్నవిస్ సర్కార్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*