మమత కొంగు బిగించారు…!

పశ్చిమ బెంగాల్ లో కమలం పార్టీ బలపడుతుండటాన్ని ముఖ్యమంత్రి మమత బెనర్జీ జీర్ణించుకోలేక పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బారతీయ జనతా పార్టీని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఈ బెంగాల్ టైగర్ ఉన్నారు. కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలహీన పడటం, ప్రాంతీయ పార్టీలు శక్తిమంతం కావడంతో విడివిడిగా పోటీ చేస్తే మళ్లీ మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పోటీ చేస్తే బీజేపీని మట్టికరిపించవచ్చన్నది రుజువైంది.

బీజేపీకి ప్రత్యామ్నాయంగా…..

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కొద్దికాలం క్రితం ప్రయత్నించారు. ఆయన మమత బెనర్జీ, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్ వంటి వారిని కలిశారు. కాని కాంగ్రెస్ లేని కూటమి సాధ్యం కాదన్నది మమత నిశ్చితాభిప్రాయం. కాంగ్రెస్ లేకుండా కూటమి పెడితే అది భారతీయ జనతా పార్టీకే ప్రయోజనకరంగా మారుతుందన్న సంగతి ఆమెకు తెలియంది కాదు.

లీడ్ తీసుకోవాలని……

ఈ నేపథ్యంలో మమత తృతీయ కూటమికి కొంగు బిగించారు. కాంగ్రెస్ తో కలసి బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ను రూపొందించాలని నిర్ణయించారు. తానే లీడ్ తీసుకోవాలని మమత నిశ్చయింాచరు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపు కుంటూ కాంగ్రెస్ తో కలసి వచ్చే లోక్ సభ ఎన్నికలకు వెళితే మోడీ ని సులువగా ఓడించవచ్చన్న ఉద్దేశ్యంతో ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఆమె కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు.

ఒకే వేదికపైకి విపక్షాలు….

ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు నిర్వహించే సభలకు మమత హాజరుకావాలని నిర్ణయించారు. డిసెంబరు నెలలో అన్ని విపక్షాలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డీఎంకే ఆధ్వర్యంలో వచ్చే నెల 30వ తేదీన చెన్నైలో జరగనున్న రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి-సమాఖ్య విధానం అనే అంశంపై జరిగే సదస్సుకు మమత హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో బీఎస్సీ, ఎస్సీ నిర్వహించే భారీ ర్యాలీలో కూడా మమత పాల్గొంటారు. మరి మమత పిలుపునకు ఎన్ని పార్టీలు కలసి వస్తాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*