ఉన్నదీ ఊడిపోతుందా…??
అదే ఫార్ములాతో మాయావతి మళ్లీ యుద్ధానికి దిగారు. మరి ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా? ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రతి ఎన్నికలకు [more]
అదే ఫార్ములాతో మాయావతి మళ్లీ యుద్ధానికి దిగారు. మరి ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా? ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రతి ఎన్నికలకు [more]
అదే ఫార్ములాతో మాయావతి మళ్లీ యుద్ధానికి దిగారు. మరి ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా? ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రతి ఎన్నికలకు ఒక వ్యూహాన్ని రచిస్తుంటారు. కొన్ని సార్లు ఆ వ్యూహాలు ఫలిస్తుంటాయి. మరికొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. ఈసారైనా మాయావతి వ్యూహం ఫలిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల ఫలితాలు మాయావతికి గట్టి గుణపాఠమే చెప్పాయి. 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక మాయావతి చతికల పడ్డారు.
అదే ఫార్ములాతో…..
మాయావతి పార్టీ కి అండగా పార్టీ ఆవిర్భవించిన నాటినుంచి దళితులు అండగా ఉంటూ వస్తున్నారు. అయితే కేవలం దళితుల ఒక్కరూ మద్దతు తెలిపితే గెలవడం సాధ్యం కాదని గ్రహించిన మాయావతి 2007 లో తన వ్యూహాన్ని మార్చారు. బ్రాహ్మణులను దగ్గరకు తీసుకున్నారు. బనియా,ఠాకూర్ వర్గాలను కూడా అక్కునచేర్చుకున్నారు. వారికే ఎక్కువ సీట్లను కేటాయించారు. ఆ ఎన్నికల్లో మాయావతి వ్యూహం ఫలించింది. విజయం చేతికి అందింది. దళితుల పార్టీగా ముద్రను చెరిపేసుకోవడానికి మాయావతి అప్పడు ప్రయత్నించి సఫలమయ్యారు.
గత ఎన్నికల్లో సయితం…..
ఇక 2014 ఎన్నికల్లో సయితం అదే రీతిలో వ్యూహాన్ని అనుసరించినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోగా బూమ్ రాంగ్ అయింది. దీంతో మాయావతి యూపీలో పట్టు నిలుపుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో జత కట్టారు. ఎస్సీకి యూపీలో బలమైన ఓటు బ్యాంకు ఉండటం, ఉప ఎన్నికల్లో ఆ ఫలితాలు కన్పించడంతో మాయావతి ఇక ఏమీ ఆలోచించకుండా అఖిలేష్ తో చేతులు కలిపేందుకు సిద్ధపడ్డారు. అయితే ఇది వర్క్ అవుట్ అవుతుందా? లేదా? అన్నది కూడా కొంత అనుమానంగానే కన్పిస్తుంది.
దళితులు దూరమయ్యే ప్రమాదం….
బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో సయితం దళితులకు, ముస్లింలకు, బ్రాహ్మణులకు, ఠాకూర్ లకు సీట్లు కేటాయించింది. అయితే ఎస్పీ, బీఎస్పీ ల పొత్తును కిందిస్థాయి క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నాయి. దశాబ్దకాలంగా ఉన్న ప్రత్యర్థులు ఏకం కావడాన్ని బీఎస్సీ, ఎస్పీ క్యాడర్ స్వాగతించలేకపోతుందంటున్నారు. దళితులు కూడా దీన్ని చికాకుగా చూస్తున్నారు. తమకు ఇన్నేళ్లుగా కొమ్ముకాస్తున్న దళితులు కూడా మాయావతికి ఈసారి హ్యాండిస్తారా? అన్న అనుమానం తలెత్తుతుంది. భీమ్ ఆర్మీ పార్టీ దళితుల ఓట్లను చీల్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బెహన్ జీ ఫార్ములా ఏ మేరకు పనిచేస్తుందనేది అనుమానంగానే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- akhilesh yadav
- bahujan samaj party
- bharathiya janatha party
- india
- indian national congress
- mayavathi
- narendra modi
- rahul gandhi
- samajwadi party
- uttarpradesh
- à° à°à°¿à°²à±à°·à± యాదవà±
- ఠమితౠషా
- à°à°¤à±à°¤à°°à°ªà±à°°à°¦à±à°¶à± à°à°¾à°°à°¤à°¦à±à°¶à°®à±
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- బహà±à°à°¨à± సమాà°à± పారà±à°à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- మాయావతి
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- సమాà°à± వాదౠపారà±à°à±