మెగా ఫ్యామిలీ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌.. రీజ‌న్ ఏంటి..?

మెగా ఫ్యామిలీ మొత్తం క‌దిలింది. అటు మెగాస్టార్ కుటుంబం స‌హా ఇటు అల్లు కుటుంబాలు రెండూ క‌ల‌సి వ‌చ్చి పోరాటానికి దిగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి వారుగా ఉన్న ఈ రెండు కుటుంబాలు కూడా ఇప్పుడు శ్రీరెడ్డి సాక్షిగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్నాయి. న‌టి శ్రీరెడ్డి ఇటీవ‌ల ఫిలిం ఇండ‌స్ట్రీపై దుమ్మెత్తి పోస్తున్న విష‌యం తెలిసిందే. ఆమె త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రించే క్ర‌మంలోనే తాజాగా ప‌వ‌న్‌పై ఆమె టార్గెట్ చేయ‌డం తీవ్ర వివాదానికి దారితీసింది . ప‌వ‌న్ త‌ల్లిని ఉద్దేశించి శ్రీరెడ్డి హాట్ కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపాయి. దీంతో ఆమె వెనుక ఎవ‌రో ఉన్నార‌ని, ఆమెను ఆడిస్తున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న మెగా ఫ్యామిలీ.. ఇప్ప‌టికే మీడియా ముఖంగా కౌంట‌ర్ ఇచ్చింది.

న్యాయపోరాటం చేయాలని…..

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, అల్లు అర‌వింద్‌లు విడివిడిగా మీడియాతో మాట్లాడారు. ప‌వ‌న్ ను అన్న‌వారిని, వారి వెనుక ఉన్న‌వారిని కూడా విడిచి పెట్టేది లేదంటూ హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉద‌యం నాటికి ప‌రిస్థితి సీరియ‌స్‌గా మారిపోయింది. శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యంలో క్లారిటీ వ‌చ్చిన నేప‌థ్యంలో వీరిపై లీగ‌ల్‌గా ప్రోసీడ్ అయ్యేందుకు పావులు క‌దుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం తెల్లవారగానే… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న‌ సోదరుడు నాగబాబుతో క‌లిసి ఫిల్మ్ చాంబర్ కు వచ్చారు. ఆ త‌ర్వాత‌ మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కో హీరో… ఒక్కో ప్రొడ్యూసర్ రావడం ప్రారంభించారు. చివరిగా చిరంజీవి కూడా వస్తాడ‌ని తెలిసింది. మా కార్యవర్గం కూడా హుటాహహుటిన సమావేశం అవుతోంది.

తమ మీద బురద జల్లుతున్నారని…..

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇండస్ట్రీలో తామేంటో బలప్రదర్శన చేయడం మెగా ఫ్యామిలీ లక్ష్యం అయి ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే… శ్రీరెడ్డి ఇష్యూలో.. వేరే కుటుంబం పరువు కాపాడటానికి తమ మీద బురద జల్లుతున్నారని అరవింద్ ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే తాము ఏ మాత్రం బలహీనంగా లేమని.. నిరూపించేం దుకు మెగా ఫ్యామిలీ సమైక్యంగా .. ఫిల్మ్ చాంబర్ వేదికగా బలప్రదర్శనకు దిగింది. సహజంగా మెగా ఫ్యామిలీకి సపోర్ట్..ఇండస్ట్రీలోని ఇరవై నాలుగు క్రాఫ్టుల్లో పనిచేసే వారంతా.. ఎలాగూ వస్తారు. కాబట్టి బలప్రదర్శన.. ఒక్క ఫ్యామిలీకే పరిమితం కాదు.. తమ బలం.. ఇండస్ట్రీ మొత్తం వ్యాపించిందని నిరూపించబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఛాంబర్‌కు వచ్చిన సమయంలో పవన్‌ బన్నీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ పరువుప్రతిష్టలకు సంబంధించిన విషయం కావడంతో అల్లు కుటుంబం కూడా కలిసి నడవాలని నిర్ణయించింది. మొత్తంగా శ్రీరెడ్డి వివాదంతో ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ కార‌ణాల‌తో ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్న మెగా ఫ్యామిలీ మెంబ‌ర్లు ఫిలిం చాబ‌ర్‌కు రావ‌డం ఆస‌క్తిగా మారింది. కొద్దిసేపటిక్రితమే పవన్ ఫిలింఛాంబర్ నుంచి వెళ్లిపోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*