పూరి ‘ మెహ‌బూబా ‘ స్వీట్ & షార్ట్ రివ్యూ

టాలీవుడ్ లో గత కొంత కాలంగా హిట్టు కోసం పరితపిస్తున్న దర్శకుల్లో సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ ముందున్నారని చెప్పాలి. పూరికి టెంప‌ర్ త‌ర్వాత హిట్ లేదు. టెంప‌ర్ త‌ర్వాత జ్యోతిల‌క్ష్మి, లోఫ‌ర్‌, ఇజం, రోగ్‌, పైసా వ‌సూల్ ఇలా అన్ని సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. పూరి అంటేనే పెద్ద హీరోలు సైతం అపాయింట్‌మెంట్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో పూరి త‌న‌ను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు త‌న త‌న‌యుడు ఆకాష్‌తో భారీ స్థాయిలో తెర‌కెక్కించిన సినిమా మెహ‌బూబా. ఇండో – పాక్ స‌రిహ‌ద్దు నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాను పూరి ఓ డిఫ‌రెంట్ క‌థ‌తో తెర‌కెక్కించాడు.

డిఫరెంట్ కథతో…..

ఇప్పటికే అమెరికాలో ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ? తెలుగుపోస్ట్‌.కామ్ షార్ట్ రివ్యూలో చూద్దాం. పూరి చాలా రోజుల త‌ర్వాత ఓ డిఫ‌రెంట్ క‌థ‌తో పాటు అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో ప్రేక్ష;కుల ముందుకు వ‌చ్చాడు. ఇండో – పాక్ వార్ నేప‌థ్యంలో సాగే ఈ ప్రేమ‌క‌థ‌లో హీరో ఆకాష్ పూరి అద్భుతంగా న‌టించాడు. నేహ‌శెట్టి కొత్త అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది. ఇక సినిమాలో ట్విస్టులు కూడా బాగున్నాయి.

పూరి మార్క్ డైలాగ్ లు…..

పూరి మార్క్ డైలాగులు, టేకింగ్ హైలెట్‌. ఫ‌స్టాఫ్ స్లోగా ర‌న్ అవుతుంది. సినిమాలో చాలా సీన్లు సినిమాకు సంబంధం లేనివిగా ఉన్నాయి. వాటిని ఎడిటింగ్‌లో క‌ట్ చేసినా సినిమాకు వ‌చ్చిన న‌ష్టం లేదు. ఇండో – పాక్ దేశాలకు సంబంధించిన ప్రేమ‌క‌థ‌లో ద‌ర్శకుడు రాసుకున్న సీన్లు, స్క్రీన్‌ప్లే బాగుంది.

సెకండ్ ఆఫ్ లో…..

పున‌ర్జన్మల నేప‌థ్యంలో సినిమా ఉంటుంది. సినిమాలో వార్ స‌న్నివేశాలు కూడా బాగున్నాయి. అయితే సినిమా ఎక్కువుగా సీరియ‌స్ నేప‌థ్యంలో న‌డ‌వ‌డంతో కామెడీ కూడా మిస్ అయ్యింది. ఫ‌స్టాఫ్ ఓ సాదాసీదాగా ఉంటే సెకండాఫ్ మాత్రం కాస్త గ్రిప్‌గా ఉంటుంది. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

ప్లస్ పాయింట్స్ :
‍‍‍- ‍ లీడ్ పెయిర్
– మ్యూజిక్
– టేకింగ్

మైనస్ పాయింట్స్ :
– మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
– అక్కడక్కడ ల్యాగ్ అవడం

ఫైన‌ల్‌గా…

పూరి మార్క్ మాస్ సినిమాగా నిలిచిన మెహ‌బూబా అంచ‌నాల‌ను మాత్రం అందుకోలేదు… మ‌రి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆద‌రిస్తారో ? చూడాలి. ఓవ‌రాల్‌గా ప్రస్తుతం మ‌హాన‌టి మానియాలో తెలుగు ప్రేక్షకులు ఉన్న నేప‌థ్యంలో మెహ‌బూబా ఆ సినిమాను త‌ట్టుకుని ఎంత వ‌ర‌కు బాక్సాఫీస్ ద‌గ్గర వ‌సూళ్లు రాబ‌డుతుందో ? చూడాలి.

 

మోహూబూబా పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్‌.కామ్‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*