మెహబూబా యూస్ ప్రీమియర్ షో టాక్

తన కొడుకు ఆకాష్ ని హీరో గా వెండితెరకు పరిచయం చేస్తూ ప్రస్తుతం వరుస ప్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాధ్ ఒక యుద్ధ ప్రేమ కథని తెరకెక్కించి ప్రేక్షకులముందుకు తీసుకువచ్చాడు. నేడు శుక్రవారమే ప్రేక్షకులముందుకు రానున్న మెహబూబా సినిమా నిన్న రాత్రే యూఎస్ లో ప్రీమియర్ షోస్ తో సందడి చేసింది. మెహబూబా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి జగన్నాధ్ ని ఈ సినిమా మళ్ళి నిలబెట్టిందా లేదా… అలాగే తన సినిమా తో తండ్రిని రి లాంచ్ చేస్తున్నానని చెప్పిన ఆకాష్ పూరి నమ్మకాన్ని మెహబూబా నిలబెట్టిందా.. లేదా.. అనేది.. యూఎస్ ప్రీమియర్ టాక్ లో చూద్దాం.

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరి ఇప్పుడు తాజాగా కొడుకుతో ఒక మంచి ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఇండో – పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ లేలేత ప్రేమ కథకు ఆకాష్ పూరి హీరో పాత్రతో న్యాయం చేశాడని అంటున్నారు. అలాగే ఆకాష్ పూరికి జోడిగా నటించిన కొత్త హీరోయిన్ నేహా శెట్టి నటన కూడా అద్భుతంగా ఉందని టాక్. అయితే ఈ మెహబూబా లో ప్రేమ కథలను విభిన్నంగా చూపించడం ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అంటున్నారు. అలాగే కథలో ఉండే ట్విస్ట్ చాలా బావుందని.. అందుకే సినిమాని …. తెరపై చూస్తేనే మంచి కిక్ ఉంటుందంటున్నారు.

కాకపోతే మెహబూబా ఫస్ట్ హాఫ్ స్లో అని… కొన్ని సన్నివేశాలను అవసరం లేకుండా పెట్టారనే ఫీలింగ్ తెప్పిస్తుందని.. అంటున్నారు. ఇక ఇండో – పాక్ యుద్ధ సన్నివేశాలు, ఆకాష్ పూరి నటన.. ఇవన్నీ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయట. ఇక సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ కి తగ్గట్టుగా ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు. అయితే ఆకాష్ పూరి డైలాగ్ డెలివరీ, కొత్త అమ్మాయి నేహా నటన ఇవన్నీ ప్లస్ అయినప్పటికీ.. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి ఎక్కినా… క్లాస్ ని మెప్పించలేదనేది టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*