అందరు ఎంపీలు కావాలా బాబులూ..!!

member of parlament in andhrapradesh

అవును! ఏ పార్టీని క‌దిలించినా.. `టార్గెట్ 25`- అనే వ్యాఖ్య బాగానే వినిపిస్తోంది. టీడీపీ కానీ, వైసీపీ కానీ, ఇంకా పూర్తిస్థా యిలో కేడ‌రే పుంజుకోని జ‌న‌సేన కానీ, ఏ పార్టీని క‌దిలించినా త‌మ ల‌క్ష్యం 25 ఎంపీ సీట్ల‌ను త‌మ ఖాతాలో వేసుకోవడ మే! అంటున్నాయి. ఈ 25 సీట్ల‌ను త‌మ ఖాతాలో వేసుకోవ‌డం అంటే.. త‌మ కోసం కాద‌ని, కేవ‌లం రాష్ట్ర ప్ర‌యోజ‌నా ల‌ను కాపాడేందుకు మాత్ర‌మే ఇలా చేస్తున్నామ‌ని వారు సెల‌విస్తున్నారు. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నా యి. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ రెండు చోట్ల విజ‌యం సాధించింది. ఇక‌, టీడీపీ మెజారిటీ స్థానాల‌ను కైవసం చేసుకుంది. వైసీపీలో గెలిచిన ముగ్గురు ఎంపీలు త‌ర్వాత కాలంలో సైకిల్ ఎక్కేశారు.

అన్నీ ఇచ్చేస్తే…..

ఇక‌, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం అంటూ.. వైసీపీ నాయ‌కుడు జ‌గ‌న్‌.. త‌న ఎంపీల‌తో రాజీనామాలు చేయించిన విష‌యం తెలిసిందే. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉన్న మొత్తం 25 ఎంపీ స్థానాల‌ను కూడా గుండు గుత్తుగా త‌మ ఖాతాలోకే జ‌మ కావాల ని అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీ, జ‌న‌సేన‌లు కూడా కోరుతున్నాయి. ఇలా ఇచ్చేస్తే.. కేంద్రంపై బాహుబ‌లి మాదిరిగా రెచ్చిపోతామ‌ని, రాష్ట్రానికి కావాల్సిన‌వి.. రావాల్సినివి కూడా ఒక్కొటొక్క‌టిగా కాకుండా గుండుగుత్తుగా తీసుకు వ‌స్తామ‌ని ఆయా పార్టీల నాయ‌కులు ఉద్ఘాటిస్తున్నారు. అయితే, ఇది సాధ్య‌మేనా? ఏపీకి నిజంగానే 25 మంది ఎంపీలు ఒకే పార్టీకి క‌ట్ట‌బెడితే.. వారంతా రాష్ట్రానికి రావాల్సిన‌వి అన్నీ కూడా తీసుకు వ‌చ్చేస్తారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

బెంగాల్ ను చూసైనా…?

నిజానికి ఒకే పార్టీకి 25 మంది ఎంపీలు ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్రంలో బ‌ల‌మైన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. ఏమీ చేయ‌లేర‌నే విష‌యం ప‌శ్చిమ బెంగాల్ విష‌యంలో క‌నిపిస్తోంది. ఈ రాష్ట్రంలో మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీకి 36 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం ఎంపీ స్థానాలు 42. మ‌రి ఇంత బ‌లంగా ఉండి కూడా ఆ పార్టీ .. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఏమీ సాధించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రి ఏపీకి కేవ‌లం 25 మంది ఎంపీలు మాత్ర‌మే ఉన్నారు. పైగా ఇక్క‌డ ఈ మొత్తం స్థానాలు కూడా ఏదో ఒకే పార్టీకి ల‌భించే అవ‌కాశం క‌ల‌లో కూడా క‌నిపించ‌దు. దీనికి ప్ర‌దాన కారణం.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌క్తులు చూపుతున్న ప్ర‌భావం బాగా వ‌ర్క‌వుట్ అవుతోంది.

వ్యతిరేకత ఉన్నా….

దీంతో పార్టీల‌తో సంబంధం లేకుండా నాయ‌కులు ప్ర‌భావం చూపుతున్న చోట్ల ఏ పార్టీ గెలుస్తుంద‌ని చెప్ప‌గ‌ల‌రు? ఉదాహ‌ర‌ణ‌కు క‌డ‌ప‌.. ఇది వైసీపీ స్థానం. ఇక్క‌డ మ‌రోపార్టీకి ఛాన్స్ లేదు. ఇక, అనంత‌పురం.. ఇక్క‌డ జేసీ దివాక‌ర్‌రెడ్డి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఎవ‌రు నిల‌బ‌డ్డా.. కష్టమే.! ఇక‌, కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ పై వ్య‌తిరేక‌త బాహాటంగా క‌నిపిస్తోంది. మ‌రి అలాంటి చోట టీడీపీ అభ్య‌ర్థులు ఎలా గెలుస్తారు? ఇలా మొత్తానికి టార్గెట్ 25 అని పైకి చెబుతున్నా.. అది సాధ్యం కాద‌నే విష‌యం ప్ర‌తి పార్టీకీ తెలిసిందే అంటున్నారు విశ్లేష‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*