మోడీని ఇలా దెబ్బేశారా?

గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మోడీ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంది. అత్యాచారం కేసులో ఆశారామ్ బాబు కు జీవిత ఖైదు ను కోర్టు విధించిన తరువాత గతంలో ఆశారాం ను ఆకాశానికి ఎత్తేస్తూ మోడీ చేసిన ప్రసంగం సోషల్ మీడియా వేదికల్లోకి చేరింది. ఆ వీడియో లో మోడీ ఆశారామ్ ను ఒక భగవత్ స్వరూపుడిగా పోల్చడం ఆయన ఆశీస్సులు తనకు లభించడం జన్మధన్యమైందని చెప్పడం కనిపిస్తాయి. గుజరాత్ లోని సబర్మతి తీరాన వేలసంఖ్యలో ఆశారాం భక్తులు ఆశీనులైన సమయంలో మోడీ తనదైన శైలిలో స్పీచ్ దంచేశారు. ఆ ప్రసంగం ఇప్పుడు బయటకు రావడం బిజెపి కి ఇబ్బందిగా మారింది.

సోషల్ మీడియా తో సీఎం నుంచి పీఎం గా …

2014 ఎన్నికల ముందు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా మాత్రమే మోడీ దేశంలో చాలా తక్కువ మందికి తెలుసు. ఆయనను భాజపా ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసి ప్రకటించాక సోషల్ మీడియా ను మోడీ వినియోగించినంత చక్కగా ఏ ఒక్కరు వాడుకోలేదు. అప్పుడప్పుడే దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న సోషల్ మీడియా ఆ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రుడిని హీరో గా దేశవాసులకు చూపింది. మోడీ ట్రెండ్ ను పూర్తిగా అనుసరించిన క్రేజ్రీవాల్ సైతం అన్నా హజారే ఉద్యమాన్ని బాసటగా చేసుకోవడం, ఢిల్లీ లో నిర్భయ కేసుల్లో సోషల్ మీడియా వేదికల్లో హీరో గా నిలిచి ఎన్నికల్లో చక్కటి లబ్ది పొందారు.

హీరోను చేసిన మీడియా జీరో చేస్తుంది…

ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ సీఎం క్రేజ్రీవాల్ ఇద్దరు సోషల్ మీడియా బేబీలే. సాంప్రదాయ మీడియా తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా తమ తమ వ్యక్తిగత ఖాతాలో తమ అభిప్రాయలు పోస్ట్ చేసి వాటిని ప్రచారం చేసే వారు. వారిద్దర్నీ హీరోలను చేసిన సోషల్ మీడియా ఇప్పుడు జీరోలు గా కూడా చూపిస్తుంది. సంప్రదాయ మీడియాను పూర్తిగా పక్కన పెట్టి ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్స్ అప్, యూట్యూబ్ , గూగుల్ ప్లస్ ఇన్ స్ట్రాగ్రమ్, వెబ్ సైట్ లు ఇలా అనేకం మోడీ, క్రేజీలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ సామాజిక మాధ్యమాలైతే గతంలో ప్రచారంతో మోతెక్కించాయో అవే వారు ఏ తప్పు చేసినా తిప్పి తిప్పి చూపిస్తూ ప్రత్యర్థులకు ఆయుధాలు అందిస్తున్నాయి. దాంతో ఒకదశలో ఆంక్షలు సైతం తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేసి అన్ని వర్గాలనుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. 2019 ఎన్నికలు అంతా మొబైల్ వేదికగా ప్రచారం సాగనుండటంతో అధికారపక్షాలకు సామాజిక మాధ్యమాలనుంచి వెల్లువలా వస్తున్న విమర్శలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నది తేలిపోతుంది. సరికొత్త రీతిలో సాగనున్న వచ్చే ఎన్నికల వార్ కి శాంపిల్స్ ఇప్పటినుంచి మొదలైపోయాయి రాజకీయపక్షాల్లో ఎవరు అప్ డేట్ అయ్యి ఎదుర్కొంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*