మాటల ముద్రగడేనా…..?

మా జాతి వాళ్లు మీకు ఎందుకు ఓట్లేయాలి!- ఇదీ నిజాలు చెప్పిన నేత వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అపార రాజ‌కీయ అను భ‌వం ఉన్న మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంధించిన ప్ర‌శ్న‌! త‌న జాతిలోనే త‌న ప‌ట్ల పెరిగిన వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేని ముద్ర‌గ‌డ‌.. ఇప్పుడు జ‌గ‌న్ పై చేసిన విమ‌ర్శ‌ల‌కు చంద్ర‌బాబు అనుకూల మీడియా వ‌త్తాసు ప‌లుకుతుండ‌వ‌చ్చు! కానీ, గ‌తంలో ఇదే మీడియా.. ఇదే చంద్ర‌బాబు ముద్ర‌గ‌డ‌ను జ‌గ‌న్‌కు అంట‌గ‌ట్టి చేసిన దుష్ప్ర‌చారం.. తుని ఘ‌ట‌న‌కు-జ‌గ‌న్‌తో అంట‌క‌ట్టి చేసిన విష ప్ర‌చారం మ‌రిచిపోవాల‌న్నా మ‌ర‌పు రానివిగా ఉన్నాయి.

ఆనాడు ఆ ప్రచారం….

ఆనాడు జ‌గ‌న్‌-ముద్ర‌గ‌డ క‌లిసిపోయార‌ని ప్ర‌చారం చేసిన టీడీపీ నాయ‌కులు.. నేడు ఇదే విష‌యంపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో గ‌ట్టి స‌మాధాన‌మే చెప్పారు. అయినా ముద్ర‌గ‌డ వాస్త‌వాల‌ను గ‌మ‌నించ‌కుండా.. త‌మ ఓట్లు ఎందుకు జ‌గ‌న్‌కు వేయాల‌ని ప్ర‌శ్నించారు. నిజ‌మే! త‌మ జాతికి జ‌రుగుతున్న అన్యాయాన్ని ఆయ‌న ఓట్ల రూపంలోనే చూసుకుంటే అంత‌క‌న్నా హ్ర‌స్వ‌దృష్టి మ‌రొక‌టి లేదు. పోనీ.. ఇదే నిజ‌మ‌ని అనుకుంటే.. కాపు ఉద్య‌మం ఠారెత్తుతున్న ప‌రిస్థితిలో.. తాను పాద‌యాత్ర‌కు సిద్ధ‌మైన త‌రుణంలో త‌న సొంత జిల్లా తూర్పు గోదావ‌రిలో కాకినాడ కార్పొరేష‌న్‌కు వ‌చ్చిన ఎన్నిక‌ల్లో తాను చూపిన ప్ర‌భావం ఏంటో ఇప్పుడు చెప్పాల్సిన అవ‌స‌రం ముద్ర‌గ‌డ‌పై ఉంది!

వ్యతిరేకించమని చెప్పినా…..

నాడు కాపుల ఉద్య‌మంపై ఉక్కుపాదం మోపిన చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఓట్లు వేయాల‌ని ముద్ర‌గ‌డ పిలుపు నిచ్చారు. అయితే, క్షేత్ర‌స్థాయిలో జ‌రిగింది ఏంటి? నాడు కాకినాడ‌లో(2017లోనే) టీడీపీకి ఓట్లు ప‌డలేదా? మ‌రి నాడు త‌న ఉద్య‌మానికి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పిన చంద్ర‌బాబుపై క‌క్ష క‌ట్టిన ముద్ర‌గ‌డ‌మాట‌ల‌ను కాపువ‌ర్గం విశ్వ సించి ఉంటే.. అప్ప‌టి కాకినాడ ఎన్నిక‌ల్లో బాబు పార్టీ చిత్తుగా ఓడిపోయి ఉండాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు క‌దా! స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనే త‌న మాట‌ల‌కు విలువ సంపాయించుకోలేని ముద్ర‌గ‌డ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట్లు గురించి మాట్లాడ‌డం విడ్డూరం కాక‌మ‌రేమిటి?

జగన్ టార్గెట్ చేస్తే…..

చ‌ంద్ర‌బాబు చేస్తున్న రాజ‌కీయ దుమారంలో తాను కూడా కొట్టుకుపోయేందుకు ముద్ర‌గ‌డ సిద్ధ‌మ‌య్యారా? అనే ప్ర‌శ్న‌కు తావిస్తున్న‌ట్టుగా ఉంది ఆయ‌న వ్య‌వ‌హారం. మంజునాథ క‌మిష‌న్ రిపోర్టు రాకుండానే, రాజ‌కీయ ల‌బ్ధి లేకుండానే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు.. అది కూడా 50% ఆవ‌ల అంటూ చేసిన తీర్మానానికి కేంద్రం బుట్ట‌దాఖ‌లు చేసిన‌ప్పుడు బాబును ప్ర‌శ్నించ‌కుండా.. నేడు ఇంకా అధికారంలోకి కూడా రాని జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డం అది కూడా ఓట్లు ఎలా వేస్తామ‌ని ప్ర‌శ్నించ‌డం విజ్ఞ‌త అనిపించుకుంటుందా? స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ముద్ర‌గ‌డ‌పై ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*