అన్న ఒక…దారిలో…!

తమ్ముడు టీడీపీ…అన్న కాంగ్రెస్… ఇదీ నల్లారి కుటుంబంలో రాజకీయం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన అధిష్టానంతో పోరాడినా ఫలితం లేకపోయింది. విభజన జరిగిపోయింది. గత ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పేరుతో జనంలోకి వెళ్లినా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఈ మాజీ ముఖ్యమంత్రి నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.

సోదరుడు టీడీపీలో…..

అయితే ఏడు నెలల క్రితం తన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయన చేరికలో కిరణ్ పాత్ర కూడా ఉందన్నది అందరికీ తెలిసిందే. బెంగుళూరులో తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలోనూ కిరణ్ పాల్గొన్నట్లు వార్తలొచ్చియా. కిషోర్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కిరణ‌ కుమార్ రెడ్డిని విపరీతంగా పొగిడేశారు. దీంతో కిరణ్ కూడా టీడీపీలోకి వస్తారేమోనన్న అనుమానం కలిగింది.

నేడు కిరణ్ చేరిక…..

కాని అన్యూహ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆపరేషన్ స్వగృహకు తెరలేపడంతో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. నిన్న రాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నారు. తిరిగి కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ కిరణ్ ను కలసి నప్పుడే ఆయన చేరికపై కొంత స్పష్టత వచ్చింది. అయితే కిరణ్ తనకు పార్టీలో అప్పగించే బాధ్యతపైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయి రాజకీయాలకే….

అయితే ఏఐసీసీ పెద్దలు మాత్రం కిరణ‌ కు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలుస్తోంది. పార్టీలోనూ అత్యున్నత పదవితో పాటు జాతీయ రాజకీయాల్లో కొనసాగాలన్నది కిరణ్ అభిప్రాయంగా ఉంది. విభజన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని ఆయన రాహుల్ కు స్పష‌్టం చేసే అవకాశముంది. జాతీయ స్థాయి రాజకీయాలకే తన పాత్రను పరిమితం చేయాలన్నది కిరణ‌ కుమార్ రెడ్డి ఆలోచన. ఇప్పుడు కిరణ‌ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. మొత్తం మీద అన్నదమ్ములు ఆంధ్రప్రదేశ్ లో చెరో పార్టీ తీర్థం పుచ్చుకుని పాలిటిక్స్ ప్లే చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*