బ్రేకింగ్ : నందమూరి హరికృష్ణ కన్నుమూత

మాజీ రాజ్య సభ సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణించారు. ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లాలో అన్నేపర్తి ప్రమాదానికి గురి కావడం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు హరికృష్ణ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నారు. సీట్ బెల్ట్ కూడా హరికృష్ణ పెట్టుకోకపోవడంతోనే ఈ ప్రమాదంలో హరికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెబుతున్నారు. 61 సంవత్సరాల వయస్సున్న హరికృష్ణ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

అచ్చిరాలేదా?

నందమూరి కుటుంబానికి విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణాలు అచ్చిరాలేదు. గతంలో హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ ఇదే మార్గంలో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ‘సినీ హీరో  జూనియర్హ ఎన్టీఆర్ కు కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడ్డారు. హరికృష్ణకు ప్రమాదం జరిగిందని తెలియడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ కూడా హెలికాప్టర్ లో నల్లగొండ జిల్లాకు బయలుదేరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1