హ‌రికృష్ణ ఆఖ‌రి కోరిక తీర‌లేదు..!

నంద‌మూరి హ‌రికృష్ణ ఇక లేరు! గంభీర‌మైన వ‌ద‌నంతో ఆయ‌న నంద‌మూరి ఫ్యామిలీలోపెద్ద దిక్కుగా.. అన్న‌గారి త‌ర్వా త అన్న‌గారిగా వెలుగొందుతున్నారు. పైకి ఎంత గంభీరంగా ఉంటారో.. మ‌న‌సు మాత్రం అంత వెన్న‌. అలాంటి హ‌రికృష్ణను ర‌హ‌దారి క‌బ‌ళించ‌డం అటు తెలంగాణ‌, ఇటు ఏపీలోనూ ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌చి వేసింది. నంద‌మూరి ఫ్యామిలీ ఏం పాపం చేసింద‌న్న ఆవేద‌న ప్ర‌తి ఒక్కరిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. నాలుగేళ్ల కింద‌ట జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం నంద‌మూరి వార‌సుడు జాన‌కి రామ్‌ను పొట్ట‌న పెట్టుకుంది. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న‌పై కంటికీ మింటికీ ఏక‌ధాటిగా విల‌పించారు నంద‌మూరి హ‌రి కృష్ణ‌. త‌న‌కు దేవుడు ద్రోహం చేశారంటూ.. న‌డిరోడ్డుపైనా బోరున విల‌పించారు. ఆ బాధతో దాదాపు చాలా కుంగిపోయిన హ‌రికృష్ణ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని…..

అయితే, ఇంత‌లోనే ఇలా అదే న‌ల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం నంద‌మూరి హ‌రికృష్ణ‌ను బ‌లితీసుకుంది. ఈ హ‌ఠాత్ప‌రిణామం ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోని తెలుగు వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదిలావుంటే, హ‌రి కృష్ణ కు బ‌ల‌మైన రెండు కోరిక‌లు తీర‌కుండానే ఆయ‌న ఈలోకాన్ని చాలించ‌డం త‌మ‌కు తీవ్రంగా క‌లిచి వేస్తోంద‌ని ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితులైన వారు క‌న్నీరు పెడుతున్నారు. హ‌రి రెండు ప్ర‌ధాన కోరిక‌ల్లో తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెట్ట‌డం ప్ర‌ధాన‌మైంది. అంత‌కు ముందు త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న టిడీపీ టికెట్‌పై అసెంబ్లీలోకి అడుగు పెట్టాల‌ని భావించారు.

హిందూపూర్ ను ఎంచుకున్నా…..

ఈ క్ర‌మంలోనే తొలుత అనంత‌పురం జిల్లా హిందూపురాన్ని ఎంచుకున్నారు. అయితే, అక్క‌డ సొంత సోద‌రుడు బాల‌య్య నిల‌బడేందుకు ఉత్సాహం చూపించ‌డంతో వెన‌క్కి త‌గ్గారు. ఆ త‌ర్వాత కృష్ణాజిల్లా పెన‌మ‌లూరు నుంచి పోటీ చేయాల‌ని భావించారు. అయితే, ఇక్క‌డ త‌న‌కు మిత్రుడు, నంద‌మూరి ఫ్యామిలీ అభిమాని బోడే ప్ర‌సాద్ నిల‌బ‌డేందుకు రెడీ అవ‌డంతో ఆయ‌న‌ను కూడా నొప్పించ‌రాద‌ని నిర్ణ‌యించు కుని త‌న కోరిక‌ను అణుచుకున్నారు. అయితే, ఆఖ‌రి ప్ర‌య‌త్నంగా నూజివీడు నుంచి పోటీ చేయాల‌ని భావించారు.

చివర వరకూ…..

నూజివీడు సీటు వ‌స్తుంద‌ని ఆయ‌న చివ‌రి వ‌ర‌కు ఎన్నో ఆశ‌ల‌తో ఉన్నారు. అయితే ఆ సీటును చివ‌ర్లో పార్టీ అధిష్టానం బీసీ కోటాలో ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఇవ్వ‌డంతో హ‌రికృష్ణ‌కు నిరాశే మిగిలింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా త‌న‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఇటీవ‌ల ఆయ‌న చంద్ర‌బాబుకు వ‌ర్తమానం పంపిన‌ట్టు స‌మాచారం.అయితే, ఈ కోరిక తీర‌కుండానే హ‌రి త‌నువు చాలించారు. ఇక‌, రెండో కోరిక త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తెర‌మీద చూడాల‌ని అనుకున్నారు. అయితే, ఇది కూడా తీర‌కుండానే హ‌రి హ‌ఠాన్మ‌రణం చెందడం ఒక్క నంద‌మూరి ఫ్యామిలీనే కాకుండా.. మొత్తం.. తెలుగు జాతిని క‌న్నీటిలోకి నెట్టింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*