అదేంటి బాబూ…అలా…?

ఏపీ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డుతున్న‌ది దేశీయ కంపెనీలేనా..? ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతున్న‌ట్లుగా ప్ర‌పంచంలోనే పేరుగాంచిన విదేశీల కంపెనీలు లేవా..? ఇప్పుడు అక్క‌డ మ‌త‌ల‌బును నిశితంగా గ‌మ‌నిస్తే ఇవే ప్ర‌శ్న‌లు ప్ర‌జ‌ల్లో ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అమ‌రావ‌తి నిర్మాణంలో పాల్గొంటున్న కంపెనీల‌పై ఆంధ్రుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్ర‌పంచంలోనే అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో రాజధాని నిర్మిస్తున్నామ‌ని బాబుగారు చెబుతున్న మాట్ల‌ల్లో వాస్త‌వం క‌న‌బ‌డ‌డం లేద‌నే వాద‌న రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది. త‌ర‌చూ ప‌ర్య‌న‌లు చేస్తున్న‌ది విదేశీ కంపెనీల‌ను ఆక‌ర్షించేందుకేన‌నీ. త‌న క్రెడిబిలిటీ చూసే ఆయా కంపెనీలు ఏపీకి వ‌స్తున్నాయ‌ని ఆయ‌న చెబుతున్నారుగానీ.. క్షేత్ర‌స్థాయిలో అవి క‌నిపించ‌డం లేద‌ని ప‌లువురు నాయ‌కులు, వివిధ సంఘాల నేత‌లు చెబుతున్నారు.

దేశాలు తిరిగేది…….

అమ‌రావ‌తి నిర్మాణంపై బాబుగారు ప‌లు సంద‌ర్భాల్లో చెప్పిన మాట‌ల్ని గుర్తు చేసుకుందాం. ఏపీలో ఓ స్లమ్ కట్టించాలంటే నేను ఎక్కడికీ వెళ్లాల్సిన‌ అవసరం లేదు. దేశీయ నిర్మాణ కంపెనీలు మురికివాడలు మాత్రమే కట్టగలవు. నేను ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాల్సి ఉంది. మురికివాడలు కాదు… అంటూ సీఎం చంద్ర‌బాబు అనేక‌మార్లు చెప్పారు. విదేశాలు తిరిగేది రాజధాని నిర్మాణానికి విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకేన‌ని ఆయ‌న సెల‌విచ్చారు. నిర్మాణంలో సింగ‌పూర్ కంపెనీలే పాల్గొంటున్నాయ‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. నిజానికి.. రాజధాని నిర్మాణంలో ఒక్క‌ విదేశీ కంపెనీ కూడా పాల్గొనటం లేదనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ కు చెందిన…..

సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు అన్నీ దేశీయ కంపెనీలకే దక్కనున్నాయి. అందులో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని నిర్మాణ విష‌యంలో చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెబుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. మొద‌టి నుంచీ కూడా రాజ‌ధాని పేరుతో భారీ మొత్తంలో అవినీతి జ‌రుగుతోంద‌ని విప‌క్షాలతోపాటు వివిధ వ‌ర్గాల వారు ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా అమ‌రావ‌తి నిర్మాణంలో విదేశీ కంపెనీలు లేవ‌ని.. కేవ‌లం దేశీయ నిర్మాణ సంస్థ‌లే ఉన్నాయ‌నే టాక్ విపించడం గ‌మ‌నార్హం.

ఏంటి మతలబు….?

అయితే, దేశీయ కంపెనీలు కేవలం మురికివాడలు మాత్రమే కడతాయని.. అవ‌మాన‌క‌రంగా మాట్లాడిన చంద్ర‌బాబుకు ఆఖ‌రికి ఇవే కంపెనీలు ఎందుకు దిక్క‌య్యాయ‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇందులో ఏదో అవినీతి మ‌త‌ల‌బు ఉండే ఉంటుంద‌నే అనుమానాలు ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాగే పోల‌వ‌రం కాంట్రాక్టు విష‌యంలో చంద్ర‌బాబు ఎన్ని మ‌త‌ల‌బులు చేశాడో ? అని కూడా కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే. ఈ విష‌యంలో సీఎం చంద్ర‌బాబు స్పందిస్తేనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*