బ్రేకింగ్ : చంద్రబాబు నివాసానికి జేసీ

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అమరావతిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ తీసుకున్న జేసీ అనంతపురం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు రెండు రోజుల క్రితం రచ్చయిన ప్రభోదానంద స్వామి వ్యవహారాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రభోదానంద స్వామి ఆశ్రమం ముసుగులో చేస్తున్న కార్యక్రమాలను చంద్రబాబుకు వీడియోల ద్వారా చూపించేందుకు జేసీ సిద్ధమయ్యారు.

చీకటి స్వామి అంటూ…….

ప్రభోదానంద స్వామి ఆశ్రమం వెనక అనేక చీకటి కోణాలున్నాయని జేసీ ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. గ్రామస్థులపై దాడి చేసి ఒకరి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదని, ప్రభోదానంద స్వామి ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలన్నది జేసీ డిమాండ్ గా ఉంది. వినాయకచవితి నిమజ్జనం సందర్భంగా చెలరేగిన అల్లర్లను అణిచి వేయడంలో పోలీసులు వైఫల్యం చెందారని జేసీ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకే ఆయన ధర్నా విరమించుకున్నారు. ప్రభోదానందను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని జేసీ పట్టుదలతో ఉన్నారు. మరి చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*