కేసీఆర్ కు బాబే టార్గెట్ …?

చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకున్నప్పుడే తమ పార్టీకి లబ్ది చేకూరుతుందని కెసిఆర్ వ్యూహంగా కనపడుతుంది. కాంగ్రెస్ పై విమర్శల దాడి తగ్గించి ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించే పార్టీ చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్ నడుస్తుందనే అంశం ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళితే పని జరుగుతుందని గులాబీ బాస్ యోచనగా ఉందని రాజకేయవిశ్లేషకుల అంచనా. ఢిల్లీ పాలకులు, ఆంధ్ర బాబు అంటూ తెలంగాణ సమాజం మీద వీరి పెత్తనం ఏమిటన్న సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారు గులాబీ దళపతి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వెళితే ఢిల్లీ పోవాలి, లేదా అమరావతి పోవాలి అన్న స్లోగన్ ని ముందుకు తీసుకువెళుతు మహా కూటమిని డిఫెన్స్ లోకి నెడుతున్నారు కెసిఆర్. సెంటిమెంట్ పునాదులమీదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తగ్గించాలన్న లెక్కల్లో కారు దూసుకుపోతుంది.

ప్రతివ్యూహం లో కూటమి …

కెసిఆర్ చంద్రబాబు పై చేస్తున్న మాటల దాడి టి టిడిపి ఎపి టిడిపి నేతలు మాత్రమే ఖండిస్తున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ తప్ప మిగిలిన వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక జనసమితి కానీ, సిపిఐ కానీ తమకు పొత్తులో దక్కే సీట్లపై ఫోకస్ పెంచాయి తప్ప అధికార పార్టీపై విమర్శలు, ఆరోపణల సంగతి ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదు. దాంతో కెసిఆర్ వ్యూహం ప్రజల్లోకి బాగా పోతుందని గుర్తించారు మహాకూటమి లోని సీనియర్లు. దీనికి ప్రతి వ్యూహం రూపొందించి గతంలో కెసిఆర్ టిడిపి కాంగ్రెస్ లతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిన అంశాలను గట్టిగా ప్రచారంలోకి తేవాలని నిర్ణయించారని తెలుస్తుంది. కూటమి తొలిజాబితా పూర్తి అయ్యాక పూర్తి స్థాయిలో ఉమ్మడి ప్రణాళిక తో మాటల దాడిని తిప్పికొట్టడానికి సిద్ధం అవుతున్నాయి విపక్షాలు. ఈ రెండు వ్యూహాల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*