బాబు ప్రయత్నం అందుకేనట…!!

nara-chandrababu-naidu-national-politics

ఒకవైపు బీజేపీపై ఆగ్రహం…మరోవైపు కాంగ్రెస్ పై కనికరం…. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు జాతీయ స్థాయిలో తమకు కావాల్సిన ప్రభుత్వం రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. అదే కాంగ్రెస్ తో కూడిన కూటమి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ తాను అనుకున్నది చేయలేదన్నది చంద్రబాబు ఆగ్రహం. చంద్రబాబు కోరుకున్నది రాష్ట్ర ప్రయోజనాలతో పాటు తన ప్రత్యర్థి వైెఎస్ జగన్మోహన్ రెడ్డి భరతం పట్టడం.

రాజీ పడేందుకు….

రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనైనా రాజీపడేందుకు ఒక దశలో సిద్ధపడ్డారు చంద్రబాబునాయుడు. అందుకే ప్రత్యేక హోదా లేదు… ప్యాకేజీ ఇస్తామన్నా అంగీకరించారు. ఏది ఎక్కువ నిధులయితే అదే మంచిదని ఆయన సర్ది చెప్పుకొచ్చారు కూడా. ఇక జగన్ కేసులను వేగవంతం చేసి ఎన్నికలకు ముందే జగన్ ను జైలుకు పంపడం. ఈ విషయంలో బీజేపీ పెద్దలు కొందరు అడ్డుకున్నారు. మోదీ సర్కార్ జగన్ కేసుల విషయంలో వేగంగా స్పందించలేకపోయింది.

జగన్ కేసుల విషయంలో….

అంతేకాకుండా రాష్ట్రంలో జగన్ కు ఆదరణ పెరుగుతుందని గ్రహించిన కమలంపెద్దలు జగన్ కేసుల జోలికి పోలేదు. ఈ విషయం చంద్రబాబుకు ఆగ్రహం కల్గించింది. ఎన్నికలకు ముందే జగన్ ను కేసుల్లో ఇరికించి, వైసీపీని మానసికంగా దెబ్బతీయాలని భావించిన చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. దీంతో చంద్రబాబు ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ఎన్డీఏ నుంచి వైదొలిగారు. మోదీకి వ్యతిరేకంగా ధర్మపోరాట దీక్షలకు దిగారు.

జాతీయ స్థాయిలో….

అయితే ఇప్పడు ఏపీలో జరిగిన పోలింగ్ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేదని భావించిన చంద్రబాబు కేంద్రంలో తాను మద్దతిచ్చిన పార్టీ పవర్ లోకి రావాలని భావిస్తున్నారు. అందుకే ఆయన జాతీయ రాజకీయాలపై విస్తృతంగా దృష్టిపెట్టారన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదానికన్నా మమత వంటి వారు ప్రధాని అయితేనే తనప్రయోజనాలు తీరతాయని చంద్రబాబు ఆశిస్తున్నారు. అందుకే మమతకు అనుకూలంగానే ఆయన వ్యవహరిస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రయోజనాలతో పాటు జగన్ ఇక్కడ అధికారంలోకి వచ్చినా కేసులను తిరగదోడే అవకాశం ఉంటుంది. మరి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది తెలియాలంటే ఈ నెల 23వ తేదీ వరకూ ఆగక తప్పదు.

Ravi Batchali
About Ravi Batchali 15997 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*