సీమ‌లో కొత్త వ్యూహం.. బాబు ప్లాన్ ఇదీ!

రాజ‌కీయం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించ‌లేం. అస‌లు ఉన్న‌ప‌ళాన వ‌చ్చే మార్పుల‌ను అంచ‌నావేయ‌లేం. ఈ సారి సీమ రాజ‌కీయాల్లో కీల క మార్పులు రానున్నాయి. ఆ నాలుగు జిల్లాల్లో ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా క‌ర్నూలు కేంద్రంగా రాజ‌కీయాలు మరింత‌గా ఆస‌క్తిదాయ‌కం కానున్నాయి. చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో చంద్ర‌బాబు, జ‌గ‌న్ ల‌లో ఎవ‌రు స‌త్తా చాటుతారో అన్న‌ది చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. అయితే, క‌డ‌ప‌లో వైసీపీబలంగా ఉంది. క‌ర్నూలులోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక్కడ ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం.

దానిపైనే నమ్మకం……

దీంతో.. దీనిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకున్నా.. ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నే గ్యారెంటీ లేద‌ని గ్ర‌హించిన సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు నైస్‌గా కాంగ్రెస్‌ను రంగంలోకి దింపుతున్నారు. అనంతపురంలో ర‌ఘువీరా, చిత్తూరులో న‌ల్లారి క‌ర్నూలులో కోట్ల వ‌ర్గీయుల‌పై న‌మ్మకాలు పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ నాయ‌కులే వైసీపీ ఓట్ల‌ను చీలుస్తార‌ని భావి స్తున్నారు. ఈ న‌మ్మ‌కం నిజ‌మ‌యితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి పెను దెబ్బ త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు జోరందుకున్నాయి. వైసీపీ ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డం ఎలాగూ అయ్యే ప‌ని కాద‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కాంగ్రెస్‌ను త‌న అస్త్రంగా మ‌లుచుకున్నారు.

ఆ సామాజికవర్గాన్ని మంచి చేసుకోవడానికి……

వాస్త‌వానికి సీమలో రాజ‌కీయాన్ని శాసించిన రెడ్ల‌ను త‌న వైపున‌కు తిప్పుకునే క్ర‌మంలోనే చంద్ర‌బాబు పార్టీ మారిన రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. చిత్తూరులో అమ‌ర్నాథ్‌రెడ్డి, క‌ర్నూలులో అఖిల‌ప్రియ‌, క‌డ‌ప‌లో ఆదినారాయ‌ణ‌రెడ్డిల‌కు బాబు త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న వాళ్ల వ‌ల్ల పార్టీకి ఉప‌యోగం లేదు. సీమలో టీడీపీ బ‌ల‌ప‌డింది లేదు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే.. అనంత‌పురంలో 14 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో 12 చోట్ల‌ టీడీపీ, కేవ‌లం 2 చోట్ల మాత్ర‌మే వైసీపీ విజ‌యం సాధించాయి. ఇక్క‌డ ఒక వైసీపీ ఎమ్మెల్యే క‌దిరి చాంద్ భాషా టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే అదే అనంత‌లో ఇప్పుడు క‌నీసం ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థులు ఓట‌మి బాట‌లో ఉన్నారు.

క్యాడర్ మాత్రం వైసీపీతోనే…..

క‌ర్నూలులో 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. వీటిలో టీడీ పీ 3, వైసీపీ 11 సాధించాయి. అయితే, చంద్ర‌బాబు ప‌న్నిన రాజ‌కీయ వ‌ల‌కు చిక్కుకుని వైసీపీలోని 11 మందిలో ఐదుగురు టీడీపీ గూటికి చేరారు. ఇక్క‌డ ఎమ్మెల్యేలు పార్టీ మారినా కేడ‌ర్ మాత్రం వైసీపీతోనే ఉంది. చిత్తూరులో 6 టీడీపీ ఎనిమిది వైసీపీ సాధించాయి. ఈ క్ర‌మంలో ఒక వైసీపీ ఎమ్మెల్యే అమ‌ర్ నాథ్ రెడ్డి జంప్ అయ్యి, మంత్రి అయ్యారు క‌డ‌ప జిల్లాలో కేవ‌లం ఒక్క‌స్థానంలోనే టీడీపీ గెలిచింది. మిగిలిన స్థానాల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంది. అంతేకాదు, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలోనూ క‌డ‌పలోని ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ప‌రిస్థితి బాలేదు. సీఎం ర‌మేశ్, ఆదినారాయ‌ణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి, లింగారెడ్డి ఇలా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న విధంగా ప‌రిస్థితి మారిపోయింది. ఏదేమైనా సీమ‌లో నాయ‌కుల‌ను చంద్ర‌బాబు పార్టీలో చేర్చుకున్నా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా వైసీపీని దెబ్బ కొట్టాల‌ని చేస్తోన్న కొత్త ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*