బాబుకు చెమ‌టలు ప‌ట్టిస్తున్నారే…!

ఏపీ సీఎస్‌గా ప‌నిచేసి రిటైర్ అయిన ఐవైఆర్ కృష్ణారావు.. త‌ర్వాత అజ‌య్ క‌ల్లాం.. ఇప్పుడు జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబును నిద్ర‌పోనివ్వ‌కుండా చేస్తున్నారు. ఒక‌ప‌క్క రాజ‌కీయంగా బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన నుంచి విమ ర్శ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనే ఈ రిటైర్డ్ అధికారులు టీడీపీ అధినేత‌ను ఇబ్బందుల్లో ప‌డేస్తున్నారు. రాజ‌కీయ నాయ‌కుల నుంచి విమ‌ర్శ‌లు ఎదురైనా.. ఇప్పుడు ఈ మాజీ అధికారుల నుంచి కూడా వ్య‌తిరేకత ఎదుర‌వ‌డం టీడీపీ నేత‌లను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇటీవలి కాలంలో టీడీపీ అధినేతపై ఊహించని వైపు నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్ర‌భుత్వంలో ప‌నిచేసి రిటైర్డ్ అయిపోయిన అధికారులు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ వ‌స్తున్నారు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి.

రాజధాని భూ కేటాయింపులపై…..

చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పని చేసిన కృష్ణారావు.. అమరావతిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. దానికి చైర్మ‌న్‌గా రిట‌ర్డ్ అయిన ఐవైఆర్‌ను నియ‌మించారు. కానీ కొద్ది రోజులకు ప్రభుత్వం ఆ శాఖ‌ను లైట్ తీసుకుంది. అప్పట్నుంచి చంద్రబాబు, ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ‌స్తున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని భూకేటాయింపులు ఇత‌ర విష‌యాల్లో బాబు ప్ర‌భుత్వాన్ని ఎండ గ‌డుతున్నారు. అంతేగాక ఒక పుస్త‌క‌మే విడుద‌ల చేసి చంద్ర‌బాబును ఇరుకున పెట్టేశారు.

ఆయనకు తోడు ఈయన…..

ఇప్పుడు కూడా అడపాదడపా అమరావతిపై ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఐవైఆర్‌కి తోడుగా సీఎస్ గానే పనిచేసిన కల్లాం అజయ్ రెడ్డి అనే అధికారి కూడా చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. సీఎస్‌గా ఆయన పదవీ కాలం పొడిగింపు కోసం.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ అనుమతి లభించలేదు. ఆ అసంతృప్తిని మనసులో పెట్టుకున్నారేమో కానీ ప్రత్యేకంగా మీడియాను పిలిచి మరీ ఏవో ఆరోపణలు గుప్పించారు. తాజాగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య కూడా చంద్ర‌బాబుపై ఆరోపణలు చేస్తున్నారు.

బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ….

చంద్రబాబు బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన చెప్పుకొస్తున్నారు. బీసీ న్యాయ‌వాదుల‌ను హైకోర్టు జ‌డ్డీలు కానివ్వ‌కుండా అడ్డుప‌డ్డార‌ని, ఓట్లేయించుకుని బీసీల‌కు న‌మ్మ‌క‌ద్రోహం చేశారంటూ చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో లేదో కానీ… ఈ అధికారుల విమర్శలు మాత్రం హట్ టాపిక్ గా మారాయి. సీఎం చంద్రబాబు కూడా.. వీరిని లైట్ తీసుకుంటున్నారు. ఉపాధి లేక వారంతా.. ఇలా చేస్తు న్నట్లుగా సెటైర్ వేశారు. వరుసగా రిటైర్డ్ అధికారులు ఆరోపణలు చేస్తూ ఉంటే.. నమ్మేవాళ్లు కొంత మందైనా ఉంటారు. మ‌రి ఈ వివాదాల‌కు చంద్ర‌బాబు ఎలా చెక్ పెడ‌తారో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*