ఆ ఇద్ద‌రి వల్లే బాబు ఓటు బ్యాంకుకు…?

చంద్ర‌బాబు దాదాపుగా ఎవ‌రినీ న‌మ్మ‌ర‌నే పేరుంది. కానీ, ఆయ‌న రాష్ట్ర పాల‌కుడు కాబట్టి కొంద‌రినైనా న‌మ్మితీరాలి. ఇలా ఆయ‌న న‌మ్మిన ఇద్ద‌రు ఇప్పుడు ఆయ‌న‌కు ఎర్త్ పెడుతున్నార‌నే వ్యాఖ్య‌లు టీడీపీలోని సీనియ‌ర్లు త‌ర‌చుగా వినిపిస్తున్నా రు. అంతేకాదు, ఆ ఇద్ద‌రి వ్య‌వ‌హారంతో అత్యంత కీల‌క‌మైన హిందువుల ఓటు బ్యాంకుపై ప్ర‌భావం చూపుతుంద‌ని, వారి మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయ‌ని కూడా సీనియ‌ర్లు గుస‌గుస‌లాడుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రు గురించి అమ‌రావ‌తిలో క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొంటున్నారు. దీంతో ఆ ఇద్ద‌రు ఎవ‌రు? ఏం జ‌రిగింది? చంద్ర‌బాబుకు ఎందుకు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి? వారిని అదుపు చేయ‌లేరా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో రెండు ప్ర‌ధాన ఆల‌యాలు ఉన్నాయి.

రెండు ఆలయాలకూ…….

ఒక‌టి తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం, రెండు విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యం. ఈ రెండు ఆల‌యాల‌కు చాలా ఆల‌స్యంగా పాల‌క మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేశారు చంద్ర‌బాబు. ఈ విష‌యంలో ఆయ‌న అనేక విధాలుగా ఒడ‌బోసి.. ఆచి తూచి వ్య‌వ‌హ రించారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఈ రెండు ఆల‌యాలకు హిందువుల మ‌నోభావాల‌కు వారి ఓట్ల‌కు ముడిప‌డి ఉండ‌డం! దీంతో చంద్ర‌బాబు కొంత స‌మ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ.. ఈ పాల‌క‌మండ‌ళ్ల ఏర్పాటు విష‌యంలో ఖ‌చ్చితంగా నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల శ్రీవారి ఆల‌య పాల‌క‌మండ‌లి చైర్మ‌న్‌గా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ను, బెజవాడ క‌న‌క‌దుర్గ ఆల‌యం పాల‌క‌మండ‌లి చైర్మ‌న్‌గా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గౌరంగ‌బాబును నియ‌మించారు. ఫ‌లితంగా ఈ ఆల‌యాల్లో అభివృద్ధి జ‌రిగి.. హిందువులు సంతోషిస్తార‌ని, త‌న‌కు, పార్టీకి ప‌రోక్షంగా మేలు జ‌రుగుతుంద‌ని చంద్ర‌బాబు భావించారు.

హిందూ వర్గాల్లో….

అయితే, ఏమైందో ఏమో.. చంద్ర‌బాబు నిర్ణ‌యం ఆదిలోనే బెడిసి కొట్ట‌డం ప్రారంభించింది. అటు తిరుమ‌ల‌, ఇటు దుర్గ మ్మ ఆల‌యాల్లో వివాదా స్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటూ.. ఈ ఇద్ద‌రు చైర్మ‌న్‌లు ఆల‌యాల ప్ర‌తిష్ట‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. తిరుమ‌ల‌లో ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మ‌ణ‌దీక్షితుల‌తో ప్రారంభ‌మైన ఈ వివాదం ఇప్పుడు దుర్గ‌గుడిలో అమ్మ‌వారికి స‌మ‌ర్పించిన 25 వేల రూపాయ‌ల విలువైన చీర మాయం వ‌ర‌కు పార్టీకి, ప్ర‌భుత్వానికి మాయ‌ని మచ్చ‌లుగా మిగిలిపోయాయి. ఈ నెలలో జ‌ర‌గ‌నున్న మ‌హాసంప్రోక్ష‌ణ సంద‌ర్భంగా శ్రీవారి ద‌ర్శ‌నాన్ని నిలిపి వేస్తున్న‌ట్టు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ప్ర‌క‌టించ‌డంతో హిందూ వ‌ర్గాలు ఒక్క‌సారిగా ప్ర‌భుత్వంపై మండిప‌డ్డాయి.

బాబుకు ఇబ్బందేనా?

అదేవిధంగా గ‌ర్భ‌గుడిలో ఏవో నిర్మాణాలు చేస్తున్నామ‌ని చెప్ప‌డం మ‌రింత వివాదానికి కార‌ణ‌మైంది. ఇక‌, దుర్గ‌గుడి విష‌యంలోనూ క్షుర‌కుల‌పై టీడీపీ నాయ‌కుడు, బోర్డు మెంబ‌రు మండి ప‌డ‌డం, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం, మ‌రో స‌భ్యుడు సెక్యూరిటీ గార్డును చేయిచేసుకోవ‌డం వంటివి మ‌రింత‌గా ప్ర‌భుత్వానికి బ్యాడ్ నేమ్ తెచ్చాయి. తాజాగా దుర్గ‌గుడిలో చీరదొంగ‌త‌నం వ్య‌వ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇది హిందూ మ‌నోభావాల‌తో కూడిన వ్య‌వ‌హారం కావ‌డం, పాల‌క మండ‌లి చైర్మ‌న్ ఈ కేసును పోలీసుల‌కు అప్ప‌గించేది లేద‌ని, తామే విచారిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం కూడా వివాదాస్ప‌దంగా మారింది. దీంతో ఈ ఘ‌ట‌న‌లు చంద్ర‌బాబుకు హిందూ వ‌ర్గాల నుంచి సెగ పుట్టిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*