వావ్…బాబూ…వారెవ్వా….!

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ పనిచేసినా దానికి ఒక లెక్కుంటుంది. ఆయన రాజకీయ ప్రయోజాలే లక్ష్యంగా ప్రతి పనీ చేస్తారు. అనాదిగా ఆయనకున్న అలవాటు అదే. ఇక ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో చంద్రబాబు ప్రతి నిమిషం….ప్రతి విషయాన్ని పార్టీకి అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట. ప్రతి ఓటరు మనసును గెలుచుకునే లక్ష్యంగానే ఆయన వేసే ప్రతి అడుగు ఉంటుందనడంలో సందేహం లేదు.

గ్రామ దర్శిని అందుకే…..

తాజాగా గ్రామదర్శిని కార్యక్రమం పెట్టి పల్లెలకు అధికారులను పంపడం ఇందులో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. 1500 తెలుగుదేశం పార్టీ విజయాలను ప్రజలకు వివరించే బాధ్యతను ఆయన అధికారుల మీద పెట్టేశారు. ప్రతి అధికారినీ ఆయన నాయకుడిగా మార్చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులను పార్టీ కార్యకర్తలుగా మార్చేస్తున్నారన్న విమర్శ ఉన్నప్పటికీ ఆయన జంకడం లేదు. ప్రతి గురు, శుక్రవారాల్లో విధిగా అధికారులందరూ గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.

గ్రామాల్లో సమస్యలు…..

ఇందుకు ప్రత్యేక కారణం ఎమ్మెల్యేల మీద ఉన్న అసంతృప్తిని అధికారుల మీదకు నెట్టేయడమేనన్నది పార్టీలోనూ విన్పిస్తున్న టాక్. పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకూ దశాబ్దకాలం పాటు అధికారం లేక, కార్యక్రమాలకు సొంత డబ్బులు వెచ్చించిన టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు అధికారంలోకి రాగానే విజృంభించారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే పై అసంతృప్తి నెలకొంది. సమస్యలపై కాకుండా వ్యక్తిగత సంపాదనపైనే దృష్టి పెట్టారన్న ఆరోపణలూ ఉన్నాయి. పలు దఫాలు చంద్రబాబు చేయించిన సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది.

వారిపై ఉన్న వ్యతిరేకత వల్లనే…..

ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తగ్గలేదని గుర్తించిన చంద్రబాబు వారితో పాటు అధికారులను కూడా పంపడం బాబు వ్యూహంలో భాగమేనంటున్నారు. గ్రామ సమస్యలను తెలుసుకుని పరిష్కరించే బాధ్యతను అధికారుల మీద పెట్టేశారు. ఒకవేళ ఎన్నికల్లోపుగా సమస్య పరిష్కారం కాకుంటే ఆ తప్పిదం అధికారుల మీదే ఉంటుంది తప్ప ఎమ్మెల్యేల మీద ఆగ్రహం ఉండదన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ఎన్పడూ లేని విధంగా అధికారులను చంద్రబాబు గ్రామాలకు తిప్పుతున్నారని, తన పొలిటికల్ టీం ఫెయిల్ కావడంతో…. అఫిషియల్ టీంను బాబు రంగంలోకి దించారన్న టాక్ అమరావతిలో బలంగా విన్పిస్తోంది. సో…..చంద్రబాబు ఐఏఎస్ లను కూడా పల్లె బాట పట్టిస్తుంది ఇందుకేనట….!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*