బాబుకు ‘‘బాండ్’’ బాజా ఖాయమేనా?

దేశంలో చంద్ర‌బాబును మించిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు మ‌రొక‌రు లేరు (ఇది ఆయ‌న చెప్పుకొన్న మాటే). ఆయ న వంటి ఆలోచ‌నా ప‌రుడు కూడా లేరు (ఇది ఆయ‌న పార్టీ నేత‌లు చెప్పేమాట‌) మ‌రి ఆ సీనియార్టీ.. ఆ అనుభవం, ఆ చ‌తు ర‌త ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డిందా? ఏపీకి ల‌బ్ధి చేకూర్చిందా? అంటే చెప్ప‌డం క‌ష్టమే! దాదాపు ప‌దేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత చంద్ర‌బాబు అధికారం చేప‌ట్టారు. ఇక‌, పార్టీ విప‌క్షంలో ఉండ‌గా ఆయ‌నకు ఆర్థికంగా దోహ‌ద‌ప‌డ్డ‌వాళ్లు.. ఆయ‌న కోసం ఖ‌ర్చు చేసిన వారు ఇప్పుడు పండ‌గ చేసుకుంటున్నారు. స‌రే! మ‌రి చంద్ర‌బాబు సీనియార్టీతో వారికి అడ్డుక‌ట్ట వేయ‌గ‌లిగారా? అంటే.. అలా చేయ‌లేక పోయినా.. అవినీతి వార్త‌ల‌ను మాత్రం అడ్డుకుంటున్నారు.

బాండ్లను తెరపైకి తెచ్చి……

అది ఇది.. అని లేకుండా అన్ని రంగాలూ అవినీతిలో `ఆల్ దిబెస్ట్‌` అని అనిపించుకుంటున్నాయి. తాజాగా చంద్ర‌బాబు అమ‌రావ‌తి బాండ్ల రూపంలో పెద్ద ఎత్తున ప్ర‌జాధ‌నం సేక‌రించారు. వాస్త‌వానికి కేంద్రం నుంచి రాజధానికి నిధులు సేక‌రించాలి. ఈ విష‌యంలో ఫెయిలైన ఆయ‌న వీటిని క‌ప్పిపుచ్చుకునేందుకు బాండ్ల‌ను తెర‌మీదికి తెచ్చారు. అయితే, ఇక్క‌డ కూడా ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇక‌, తాజాగా విప‌క్ష నేత జ‌గ‌న్ చెప్పిన వివ‌ర‌ణ ను బ‌ట్టి.. భారీ ఎత్తున ఈ విష‌యంలో చంద్ర‌బాబు త‌న సీనియార్టీని వినియోగించి.. ప్ర‌జ‌ల నెత్తిన కుంప‌టి పెట్టార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అమ‌రావ‌తి బాండ్ల విష‌యంలో చంద్ర‌బాబు `బాండ్ బాజా` పేరుతో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు.

ఇది తగునా?

అయితే, వీటివ‌ల్ల ప్ర‌భుత్వానికి త‌క్ష‌ణ సాయం అందినా.. త‌ర్వాత మాత్రం ప్ర‌జ‌ల‌కు గుండు ఖాయ‌మ‌ని విప‌క్ష నాయకుడు వివ‌రించారు. ఈ బాండ్ల విక్ర‌యం ద్వారా ప్ర‌భుత్వానికి రూ.2 వేల కోట్లు వ‌చ్చాయ‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. అయితే, రూ.2 వేల కోట్ల బాండ్ల మీద వడ్డీ మాత్రం 10.32 శాతం. ఇది అత్యంత భారీ వ‌డ్డీ! మ‌న ప‌క్క‌రాష్ట్రం, ఆర్థికంగా మ‌న‌క‌న్నా బాగానే ఉన్న రాష్ట్రం. తెలంగాణ జీహెచ్‌ఎంసీకి సంబంధించి బాండ్లు తెచ్చింది. అక్కడ వడ్డీ రేటు 8.9 శాతం. మ‌హారాష్ట్రంలోని పుణే వాళ్లు 7.59 శాతం వడ్డీకే తెచ్చారు. పక్క రాష్ట్రం వాళ్లు అంత తక్కువ వడ్డీకి తెస్తే.. ఇక్కడ ఎక్కువకు తీసుకొచ్చి రూ.2 వేల కోట్లకు మరో రూ.2 వేల కోట్లు కలిపి పదేళ్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్ప‌డ‌నుంది! మ‌రి దీనిని చంద్ర‌బాబు సీనియార్టీకి నిలువెత్తు నిద‌ర్శ‌నం అన‌బోరా?! ఇదీ ఇప్పుడు విప‌క్షాలు చేస్తున్న కామెంట్‌! మ‌రి దీనిని చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*