అక్కడ ఇక బాంబ్ బ్లాస్టేనా?

మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డం, అవి కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌డంతో టీడీపీ అధినేత‌, ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. గ‌తంలో వ్య‌క్తుల‌ను చూసి చేసే రాజ‌కీయాలు ఇప్పుడు సామాజిక వ‌ర్గాల‌ను, కులాల‌ను చూసి చేయాల్సి వ‌స్తుండ‌డంతో ఆయ‌న అదేవిధంగా అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కులాల‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న కూడా కులాల‌కు సంబంధించిన కీలక నేత‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఎవ‌రు ఔన‌న్నా కాద‌న్నా 2009 ఎన్నిక‌ల్లో మూడు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోరు కులాల ప్రాతిపదిక‌గానే జ‌రిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన ఎంట్రీతో మూడు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య‌, మూడు ప్ర‌ధాన కులాల మ‌ధ్య వార్‌గా ఎన్నిక‌లు ఉండ‌బోతున్నాయ‌న్న‌ది ఓ క్లీయర్ పిక్చ‌ర్ అయితే ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రంపై క‌న‌ప‌డుతోంది.

ఆశావహులు ఎక్కువే…..

ఈ క్ర‌మంలోనే తన కేబినెట్‌లో ఖాళీ అయిన రెండు మంత్రి ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఈ ప‌ద‌వుల‌కు చంద్ర‌బాబు ఇస్తున్న ప్రాధాన్యం ఎలా ఉన్నా.. ప‌ద‌వుల‌పై ఆశ పెట్టుకున్న నాయ‌కుల సంఖ్య మాత్రం ఎక్కువ‌గా ఉంది. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లా గుంటూరుకు చెందిన టీడీపీ నాయ‌కుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం., మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారిలో గుంటూరుకు చెందిన సీనియ‌ర్ మోస్ట్‌లు, నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగులేని ఆధిప‌త్యం చ‌లాయిస్తున్న‌వారు ఎక్కువ‌గా ఉన్నారు. వీరంతా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈసారైనా ధూళిపాళ్లకు…….

గుర‌జాల‌ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్‌, స‌త్త‌న ప‌ల్లి ఎమ్మెల్యే క‌మ్ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు, మాజీ మంత్రి తెనాలి ఎమ్మెల్యే ఆల‌పాటి రాజా వంటి ఉద్ధండులు మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక జిల్లా టీడీపీ అధ్య‌క్షులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ.ఆంజ‌నేయులు సైతం రేసులో ఉన్నానంటున్నారు. అయితే, ఇప్ప‌టికే గుంటూరుకు చెందిన ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండ‌డం గ‌మ‌నార్హం. పుల్లారావు క‌మ్మ వ‌ర్గానికే చెందిన వ్య‌క్తి. తాజాగా త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు చంద్ర‌బాబు శ్రీకారం చుట్ట‌నున్నార‌ని స‌మాచారం.

మైనారిటీకి మంత్రి పదవి…..

ముఖ్యంగా గుంటూరులో జ‌ర‌గ‌నున్న నారా హ‌మారా-టీడీపీ హ‌మారా స‌భ‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ స‌భా వేదిక మీదే బాబు మైనార్టీ మంత్రి ప్ర‌స్తావ‌న తెచ్చారు. ప్ర‌ధానంగా మైనార్టీ శాఖ‌ను ఏర్పాటు చేయాల‌ని చంద్ర‌బాబు కొంత‌కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మైనార్టీ వర్గాన్ని ఆక‌ర్షించేందుకు , వారిఓట్లు టీడ‌పీ కి ప‌డేలా చేసేందుకు ఇంత‌కు మించిన మార్గం లేద‌ని ఆయ‌న యోచిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాబు తాజా వ్యాఖ్య‌ల‌తో గుంటూరు వేదిక‌గా మంత్రి మండ‌లి విస్త‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టిన‌ట్ల‌య్యింద‌న్న చ‌ర్చ ఏపీ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

కామినేని ప్లేస్ లో……

అయితే, త‌మ సొంత జిల్లాలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్న చంద్ర‌బాబు త‌మ‌కు న్యాయం చేస్తార‌ని య‌ర‌ప‌తినేని, ఆల‌పాటి భావిస్తున్నారు. బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామాతో ఓ క‌మ్మ కేబినెట్ పోస్టు ఖాళీ అయ్యింది. ఇప్పుడు దీనిపైనే గుంటూరు జిల్లా క‌మ్మ టీడీపీ ఎమ్మెల్యేలు భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక‌, త‌మ‌కైతే త‌ప్ప‌కుండా మంత్రి ప‌ద‌వులు ఖాయ‌మ‌ని ధూళిపాళ్ల‌, కోడెల త‌ల‌పోస్తున్నారు. న‌రేంద్ర ఇప్ప‌టికే బాబుపై అల‌క‌తో పార్టీ కీల‌క వ్య‌వ‌హారాల్లో అంటీముట్ట‌న‌ట్టు ఉన్నారు. ఇక కోడెల ఒక‌రిద్ద‌రు ప‌త్రికాధినేత‌ల‌తో చెప్పించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా… అవి గ‌తంలో స్పీక‌ర్ వ‌ర‌కే ప‌నిచేశాయ‌ని ఇప్పుడు బాబు వారి మాట కూడా విన‌రంటున్నారు. ఈ క్ర‌మంలో ఏమాత్రం తేడా వ‌చ్చినా.. పార్టీలో వీరిలో ఒక‌రిద్ద‌రు రెబ‌ల్ గా మారే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*