టీడీపీలో స‌రికొత్త గ‌ళం…. మాట‌ల తూటాలే..!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రు కొత్త‌గా పుట్టుకు వ‌స్తారో చెప్ప‌డం క‌ష్టం. ఎవ‌రు వ‌చ్చినా.. పార్టీల‌కు ప్ల‌స్ అయితే చాల‌నుకునే అధినేత‌లు ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు ప్ల‌స్ కానున్నాయి. ప్ర‌తి పార్టీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను త‌న‌వైపు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీ కూడా తిరిగి అధికారాన్ని కైవ‌సం చేసుకునేందుకు రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో అనుకూలంగా ఉండే ప్ర‌తి విష‌యాన్ని కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు విడిచి పెట్ట‌డం లేదు. ముఖ్యంగా అధికార ప‌క్షాన బ‌ల‌మైన వాయిస్ వినిపించేవారికి మ‌రింత మ‌ద్ద‌తు ఇస్తున్నారు.

పరకాలకు అందుకే…..

ఎమ్మెల్యేలుగా ఉండి, ఎంపీలుగా ఉండి కూడా విఫ‌ల‌మ‌వుతున్న‌వారు, స‌క్సెస్ అవుతున్నావారు.. ప్ర‌భుత్వ ప‌క్షాన గ‌ట్టి గ‌ళం వినిపిస్తున్నావారు ఎవ‌రు? అనే విష‌యాన్ని ప‌రిశీలించి ప్రోత్స‌హిస్తున్న‌ట్టుగానే.. నామినేటెడ్ ప‌ద‌వుల్లో ఉన్న‌వారిని కూడా ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్న‌వారిని ఒడిసి ప‌ట్టుకుంటున్నారు చంద్ర‌బాబు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప్ర‌భుత్వ ప‌క్షాన నిల‌బ‌డుతున్న వారికి పెద్ద‌పీట వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త‌.. ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌కు చంద్ర‌బాబు త‌న టీంలో పెద్ద పీట వేశారు. ఆయ‌న‌ను స‌ల‌హాదారుగా నియ‌మించారు. దీంతో ప‌ర‌కాల ప్ర‌భాకర్ కూడా చంద్ర‌బాబుకు అనుకూలంగానే వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వంపై విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొట్టారు. అదేవిధంగా ప్ర‌భుత్వం తాలూకు ప‌నుల‌ను చ‌క్క‌టి ప్ర‌ణాళిక ప్ర‌కారం నిర్వ‌హించి చంద్ర‌బాబు మెప్పుపొందారు. వివిధ దేశాలు వెళ్లిన‌ప్పుడు కూడా చంద్ర‌బాబు వెంట ఉండి ప‌క్కాగా వ్య‌వ‌హ‌రించేవారు. ఒకానొక ద‌శ‌లో ప‌ర‌కాల చంద్ర‌బాబు కోర్ టీంలో కీల‌కంగా మారిపోయారు. పార్టీలో కొంద‌రు మంత్రులు, సీనియ‌ర్లు సైతం ఆయ‌న హోదా చూసి షాక్ అయ్యే ప‌రిస్థితి వ‌చ్చింది.

కుటుంబరావుకు పెరిగిన……

అయితే, వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ప‌ర‌కాల రాజీనామా చేశారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌కాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావుకు ప్రాధాన్యం పెరిగింది. ఇటీవ‌ల కాలంలో కుటుంబరావు ప్ర‌భుత్వానికి అనుకూలంగా గ‌ళం వినిపిస్తున్నారు. పోల‌వ‌రం మొద‌లుకుని, కేంద్ర ప్రాజెక్టుల వ‌రకు ఆయ‌న ప్ర‌భుత్వ ప‌క్షాన కీల‌కంగా వ్యాఖ్య‌లు కుమ్మ‌రిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావుకు వ్య‌తిరేకంగా కౌంట‌ర్లు ఇవ్వ‌డంలోనూ స‌వాళ్లు రువ్వ‌డంలోనూ కూడా కుటుంబ‌రావు త‌న‌దైన శైలితో ముందుకు సాగుతున్నారు.

విమర్శలను తిప్పికొడుతూ…..

గతంలో బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాం మాధ‌వ్ ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప‌దే ప‌దే టార్గెట్ చేసేవారు. రాం మాధ‌వ్ టీడీపీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారాడు అనుకుంటున్న టైంలో టీడీపీ వాళ్లంద‌రూ మూకుమ్మ‌డిగా ఆయ‌న్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు రాం మాధ‌వ్ మాట‌ల దాడి త‌గ్గ‌గా ఆ ప్లేస్‌లోకి ఇటీవ‌ల ఏపీ కి చెందిన బీజేపీ త‌ర‌పున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన జీవీఎల్‌.న‌ర‌సింహారావు వ‌చ్చారు. న‌ర‌సింహారావుపై కుటుంబ‌రావు ప‌దే ప‌దే ప‌దునైన మాట‌ల తూటాల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వినియోగించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*