బాబు వేటు వేసేది వీరిపైనేనా?

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలోను రాజకీయం హీట్‌ ఎక్కింది. అధికార టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో సతమతమౌతోంది. సీఎం చంద్రబాబు కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగుల‌ను మారుస్తామని.. ఛాన్సులు రాని వారు బాధ పడవద్దని, వాళ్లకు ఏదో ఒక పదవితో సద్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కీలకమైన కృష్టా జిల్లాలో టీడీపీకి ఎంత పట్టు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ సత్తా చాటుతూ వ‌స్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లు రెండు ఎంపీ స్థానాలు టీడీపీ గెలుచుకుంది. కైక‌లూరులో టీడీపీ మిత్రపక్షంగా పోటీ చేసిన బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్‌ గెలుపొందారు.

సిట్టింగ్ లకు నో ఛాన్స్……

ఇక వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కొంత మంది టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జులకు టిక్కెట్లు దక్కే సూచనలు కనబడడంలేదు. వచ్చే ఎన్నికల్లో తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ పేరు టికెట్‌ రాని వారి లిస్ట్‌లో ప్ర‌థ‌మంగా విసిపిస్తోంది. గత మూడు ఎన్నికల్లోనూ వరుస‌గా ఓడిపోతూ వస్తున్న స్వామిదాసు నిర్లక్ష్య వైఖ‌రే తిరువూరులో పార్టీ పుంజుకోక పోవడానికి కారణంగా నిలిచినట్టు ఇప్పటికే పార్టీ అధిష్టానం భావిస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ స్వల్ప తేడాతో స్వామిదాసు చేచేతులా ఓడిపోయారు. ఈ క్రమంలోనే స్వామిదాసును పక్కనపెట్టి వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపనున్నారు.

నూజివీడు బరిలో…..

ఈ క్రమంలోనే ఇదే నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత మంత్రి జవహర్ (ప్ర‌స్తుతం ఆయ‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ) పేరు సైతం తిరువూరు రేసులో ఉంది. జవహర్‌ ఇక్కడ పోటీ చేసేందుకు ఇష్టపడకపోతే మరో కొత్త అభ్య‌ర్థే ఖ‌రార‌వుతారు. ఇక నూజివీడు ఇన్‌చార్జ్‌ ముద్రబోయిన వెంకటేశ్వరరావును సైతం వచ్చే ఎన్నికల్లో కొనసాగిస్తారా ? అనేది సందేహంగానే మారింది. ఇక్కడి నుంచి మరో బలమైన బీసీ నేత లేదా దేవినేని అవినాష్‌ తదితర పేర్లు రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక గుడివాడ ఇన్‌చార్జ్‌ రావి వెంకటేశ్వరరావు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని ఎంత వరకు ఢీ కొడతారన్న విషయంలో పార్టీ నేతలకే సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రావి వెంకటేశ్వరరావుకు బదులుగా మరో బలమైన నేత కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది.

వ్యతిరేకత ఉన్న వారిపై……

కైక‌లూరులో గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ పోటీకి రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే జ‌య‌మంగ‌ళ వెంకటరమణతో పాటు ఏలూరు ఎంపీ మాగంటి బాబు అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటే ఆయన పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విజయవాడ వెస్ట్‌ నుంచి జలీల్‌ఖాన్‌ తప్పుకుంటే ఆయన కుమార్తెకు ఛాన్స్‌ ఇవ్వొచ్చు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనలపై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉన్నా మహిళా కోటాలో వీరినే కంటిస్యూ చేస్తారని తెలుస్తోంది. నందిగామలో తంగిరాల సౌమ్యను కొంత మంది వ్యతిరేఖిస్తుంటే కొంత మంది ఆమెకే మద్దతు పలుకుతున్నారు. మంత్రి ఉమా స‌పోర్ట్ ఆమెకే ఉన్న‌ట్టు తెలుస్తోంది. పామర్రులో ఉప్పులేటి కల్పన పాత టీడీపీ నాయకులను కలుపుకుని వెళ్లడంలేదని విమర్శలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ కూడా బలంగా ఉండడంతో కల్పన అభ్యర్థిత్వంపై చివరి వరకు ఊగిసలాటలు తప్పకపోవచ్చు. ఏదేమైనా జిల్లాలో ఐదారు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఇన్‌ఛార్జులతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేల విషయంలో మార్పులు చేర్పులు ఉండే ఛాన్సులు కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*