అనంతపురం ఇక అంతేనా ….?

అనంతపురం లో తెలుగు తమ్ముళ్ళ లొల్లి అధికారపార్టీని తీవ్రంగా కలచివేస్తుంది. ఎన్నిసార్లు అధినేత చంద్రబాబు విభేదాలు సర్దుబాటు చేస్తున్నా వారిద్దరి నడుమ వార్ కు బ్రేక్ లు మాత్రం పడటం లేదు. ఎన్నికలకు ఇంకా ఆరునెలల పైనే సమయం ఉండాగానే టిడిపి ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో ఈ గొడవ ఎలా సర్దుబాటు చేయాలో బాబుకు సైతం అర్ధం కానీ పరిస్థితి తెచ్చి పెట్టింది. ఎవరిని గట్టిగా మందలించినా ఎలాంటి నిర్ణయాలు వారు తీసుకుంటారన్న భయం అధినేత ను మౌనం ఆశ్రయించేలా చేస్తుంది. ఇదే టిడిపికి అక్కడ తీవ్రంగా చేటు చేస్తుంది.

అగ్గిపుల్ల గీయకుండానే…..

ఎంపీ జెసి దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి నడుమ ఎప్పటినుంచో తీవ్రమైన మాటల యుద్ధం సాగుతుంది. ఇద్దరి నడుమ ఇప్పుడు రోడ్డెక్కే స్థాయిలో ఆరోపణలు విమర్శల పర్వం పసుపు పార్టీలో గుబులు రేపుతోంది. పార్టీ మారివచ్చినప్పటికీ జెసి దివాకర రెడ్డి రాజకీయాల్లో డక్కా మొక్కి తిన్న వ్యక్తి. తనపంతం కోసం అవసరమైతే చంద్రబాబును సైతం ఎదిరించే నేతగా జెసికి పేరుంది. మరో పక్క పార్టీకి తొలినుంచి అండగా వున్న ప్రభాకరచౌదరి బాబుకు వీరవిధేయుడు.

ఎటూ చెప్పలేక……

ఆయనను సైతం పక్కన పెట్టలేని దుస్థితి చంద్రబాబు ది. ఇద్దరు పార్టీ అధినేతకు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో అనంత వివాదంలో బాబు ఎటు వ్యవహరించలేని పరిస్థితి నడుస్తుంది. ఇరువురి నేతలు బాహాటంగా, బహిరంగంగా యుద్ధం మొదలు పెట్టడంతో మరోదఫా బాబు రంగంలోకి దిగి సర్దుబాటు చెయ్యక తప్పదన్నట్లే అనంత తెలుగుదేశం రాజకీయాలు మారిపోయాయి. దీనికి రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*