లింకులు…. బాబు భళా…..!

చంద్రబాబు ఎన్నికల వేళ ప్రజల మూడ్ ను తనవైపునకు తిప్పుుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. జనం మైండ్ సెట్ లో మార్పు వచ్చేలా ఆయన ఎన్నికల వేళ చేయని ప్రయత్నాలుండవు. తానొక్కడినే నిజాయితీ పరుడినని, తానే పారదర్శకతకు బ్రాండ్ అంబాసిడర్ ని అని, మిగిలిన వాళ్లంతా కుట్రలు, కుతంత్రలకు తెరలేపుతారని చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. అది టెలికాన్ఫరెన్స్ కానివ్వండి… బహిరంగ సభ కానివ్వండి…. అసెంబ్లీ కానివ్వండి… ఆయన దృష్టంతా ప్రత్యర్థులను వీక్ చేయడమే. ఆ ప్రయత్నంలో చంద్రబాబు భవిష్యత్తులో విజయం సాధిస్తారో లేదో తెలియదు కాని ఆవలి పక్షం మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలతో కొంత అయోమయంలో పడక తప్పేట్లు లేదు.

జగన్, బీజేపీ లోపాయికారీగా…..

నిన్న మొన్నటిదాకా జగన్, భారతీయ జనతాపార్టీ ఒకే తానుముక్కలని చెప్పారు. జగన్ తో కలసి బీజేపీ తనపై కుట్రలు చేస్తుందని పదే పదే చెప్పారు. ఇందుకు రాష్ట్ర పతి , ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతుగా నిలిచిన విషయాన్ని నిత్యం గుర్తు చేస్తున్నారు. తాను నాలుగున్నరేళ్లు కలసి ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసమేనంటారు. జగన్ కేసుల నుంచి తప్పించుకోవడానికే బీజేపీతో లాలూచీ రాజకీయాలకు తెరదీసి తనపై కుట్రకు తెరలేపుతున్నారు. సాధారణంగా వచ్చే నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను కూడా చంద్రబాబు ఇలా రాజకీయాలకు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత తనకు మిత్రుడిగా ఉన్న జనసేనాని పవన్ ఎదురుతిరగడంతో ఆయనకూ కాషాయ రంగు పులిమేశారు.

జీతాలు దండగంటూ……

ిఇక వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకపోవడాన్ని కూడా పదే పదే ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షాన్ని ప్రజలు నమ్మడం లేదంటున్నారు. అంతేకాదు అసెంబ్లీకి రానప్పుడు జీతాలు తీసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్న విషయాన్ని, వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురికి మంత్రిపదవులు ఇచ్చిన విషయంపై మాత్రం ఎక్కడా పెదవి విప్పరు. అదేమంటే అది న్యాయస్థానంలో ఉందంటారు.

కేసీఆర్ పై కూడా……

ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చేశాయి. తెలంగాణలో మహాకూటమి ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో జత కడుతుంది. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా ఆయన ఇదే తరహా ప్రచారాన్ని ప్రారంభించారు. తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వైఖరి మారిందన్నారు. మోదీ మాటలను వినే టీఆర్ఎస్ తమకు సహకరిండం లేదని అసెంబ్లీలో బావురు మన్నారు. తాను నాలుగున్నరేళ్లు కమలం పార్టీతో దోస్తీ చేసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం. కాని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదేమో. ఇలా చంద్రబాబు తానే మంచోడిని… ఊరంతా చెడ్డోళ్లేనన్న ప్రచారాన్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకూ సఫలమవుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*