“అనంత” ఎమ్మెల్యేలకు వార్నింగ్

ఎన్నికల హీట్ పెరిగిన క్రమంలో నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న చంద్రబాబు, కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్రం తీరును వివిధ వేదికలపై వివరించాలని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. .ఎమ్మెల్యేలు శిక్షణా కార్యక్రమాలకు హాజరు కాకపోవడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశఆరు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై ఆయన నేరుగా ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.12 మంది ఎమ్మెల్యేలున్నా.. ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తోన్నా.. మెజార్టీ నేతలు స్పందించడం లేదంటూ బాబు అసంతృప్తి
ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పనితీరు మెరుగుపర్చుకోకుంటే……

పనితీరు మెరుగు పరుచుకోకుంటే ఉపేక్షించేదే లేదని మరోసారి స్పష్టం చేశారు చంద్ర బాబు. చాలా సార్లు చెప్పానని.. అయినా మార్పు రాకుంటే పక్కన పెట్టేస్తానంటూ ఎమ్మెల్యేలకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు. ఎమ్మెల్సీల పనితీరు పైనా చురకలంటించిన బాబు, మీడియా కెక్కుతూ వివాదాలకు కేంద్ర బిందువవుతోన్న జేసీ తీరును పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అతి కొద్ది మంది నేతలు స్పాంటెనియస్ గా స్పందిస్తున్నారని.. కొందరు ఓవరుగా స్పందిస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బుద్దా వెంకన్న పనితీరు మెరుగు పడిందని చంద్రబాబుఆయనకు కితాబు ఇచ్చారు.

టీఆర్ఎస్ పై వ్యతిరేకత……

టీడీఎల్పీలో తెలంగాణ రాజకీయాలపైకూడా ప్రస్తావన వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. వ్యతిరేకత లేదనే ప్రచారమే మొన్నటి వరకు జరిగిందన్న చంద్రబాబు., ప్రస్తుతం ప్రచారానికి వెెళ్తోన్న నేతలకు వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్న అభిప్రాయపడ్డారు. ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉంటున్నారని.. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని తెలిసినా సరిదిద్దుకుంటున్నామన్న చంద్రబాబు ఎమ్మెల్యేలకు తెలిపారు.తెలంగాణలో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కేసీఆర్ పై లేదని కొందరంటున్నారని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

ఇక ప్రజల్లోనే ఉండండి……

‘అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాలు పూర్తయ్యాయని.7రోజులు అర్థవంతమైన చర్చ జరిగిందని, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం,నదుల అనుసంధానం,గ్రామదర్శని,పేదల సంక్షేమం,నాలుగేళ్ల అభివృద్ధి, కేంద్రం వివక్షత,ఏపి పునర్విభజన చట్టం అమల్లో నిర్లక్ష్యం.. అన్నింటిపై సమగ్రంగా చర్చించామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.ప్రతిపక్షం లేకున్నా సభ బాగా జరిగిందన్న సందేశం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. .అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయని, ఇక నిరంతరం ప్రజల్లోనే ఉండాలని, ‘గ్రామ వికాసం,వార్డు వికాసం’ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని, ఏరోజుకా రోజు పనితీరును ఎవరికి వారే విశ్లేషించుకోవాలని సూచించారు. ‘గ్రామ వికాసం’ కార్యక్రమం ఇప్పటివరకు 22%మాత్రమే పూర్తయ్యిందని, రాబోయే 3నెలల్లో 100%పూర్తిచేయాలని టార్గెట్ పెట్టారు. ప్రతి సీటు ప్రధానమేనని, ప్రతి సీటులో గెలవాలని, అన్ని సీట్లలో గెలుపును ఛాలెంజ్ గా తీసుకోవాలన్నారు. ప్రభుత్వంపై,పార్టీపై ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. వాతావరణం అనుకూలంగా ఉందని, దీనిని సానుకూలం చేసుకోవాల్సిన బాధ్యత నాయకత్వానిదేనని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది,సంక్షేమాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా…….

ప్రతినెలా అన్ని నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి, నాయకుల తీరును విశ్లేషిస్తున్నా నని తెలిపారు.ప్రజలతో వినయంగా ఉండాలని, .కార్యకర్తలను గౌరవంగా చూడాలని, ప్రతిపక్షంపై కఠినంగా ఉండాలని కోరారు. ప్రజలతో సన్నిహిత్యం, కార్యకర్తల పట్ల గౌరవం,ప్రతిపక్షంతో కఠినంగా వ్యవహరించడం నాయకుడి లక్షణాలన్నారు.ఇవి లేకపోతే పార్టీకి భారంగా మారతారని, అతిగా వ్యవహరించినా,మందంగా ఉన్నా రెండూ నష్టదాయకాలేనని చంద్రాబాబు అభిప్రాయపడ్డారు. ఏ కొందరు నాయకుల వల్లనో పార్టీకి చెడ్డపేరు రాకూడదని, ఒక నియోజకవర్గంలో తప్పు జరిగినా దాని ప్రభావం రాష్ట్రం మొత్తం పార్టీపై పడుతుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీకి నష్టం చేస్తే సహించేది లేదన్నారు. విశ్వసనీయత అనేది రాత్రికిరాత్రే రాదని, ఏ చిన్న తప్పు చేసినా దశాబ్దాల కష్టం నీరుగారిపోతుందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*