అప్పుడు క్లీన్ స్వీప్….ఇప్పుడు ఎన్నో ప్లేస్….?

నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు ఎన్నిక అవ్వడంలో పశ్చిమగోదావరి జిల్లా పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లను బీజేపీతో కలిసి టీడీపీ క్లీన్‌ స్విప్‌ చేసేసింది. చంద్రబాబు తన సొంత జిల్లాలో సైతం వైసీపీ జోరుకు తలవంచక తప్పలేదు. విపక్ష అధినేత జగన్‌ సొంత జిల్లాలో సైతం టీడీపీ ఒక సీటు గెలుచుకుంది. చంద్రబాబు, జగన్‌ సొంత జిల్లాలకు భిన్నంగా పశ్చిమ ఓటర్లు మాత్రం టీడీపీకి ఏకపక్షంగా తీర్పు ఇచ్చేశారు. దీనిని బట్టీ పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వార్‌ ఎలా వన్‌ సైడ్‌ అయ్యిందో స్పష్టం అవుతుంది. స్వ‌త‌హాగా టీడీపీకి పశ్చిమగోదావరి కంచుకోటే అయినా గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ టీడీపీ, బీజేపీలకు సపోర్ట్‌ చెయ్యడం కూడా ఈ కూటమికి కలిసి వచ్చింది.

ఆరేడు నియోజకవర్గాల్లో……

జిల్లాలో డెల్టాలో బలంగా ఉన్న కాపు ఓటర్లు ఆరేడు నియోజకవర్గాల్లో గెలుపు, ఓటమిలను బలంగా ప్రభావితం చేస్తారు. ఈ క్రమంలోనే పవన్‌ గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్‌ చెయ్యడం ఆ పార్టీ అభ్యర్థులకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరి పోరుకు రెడీ అవుతుండడం… ఇటు బీజేపీకి కూడా టీడీపీకి దూరం కావడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరి పోరుకే రెడీ అవుతుంది. ఎలాంటి సమీకరణలు మారకపోతే టీడీపీ దాదాపుగా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లక తప్పని పరిస్థితి. పవన్‌ కళ్యాణ్‌ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లో బలంగా కనిపించే ఛాన్సులు ఉన్నాయి.

ముచ్చెమటలు పట్టిస్తున్న……

ముఖ్యంగా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న పవన్‌ సొంత నియోజకవర్గమైన నరసాపురంతో పాటు పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం సెగ్మెంట్లలో జనసేన ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఈ నాలుగు సీట్లలో తాడేపల్లిగూడెంలో ఆ పార్టీ నుంచి ఈలి నాని విజయం సాధించగా పాలకొల్లు, నరసాపురం, భీమవరంలో టీడీపీని మూడో ప్లేసుకు నెట్టి ప్రజారాజ్యం రెండో స్థానంలో నిలిచింది అంటే ఇక్కడ సామాజిక సమీకరణలు ఎలా ఉంటాయే స్పష్టంగా తెలుస్తోంది.అదే నరసాపురం సెగ్మెంట్‌ పరిధిలోని తణుకులో సైతం కాపు సామాజికవర్గ ఓటర్లు పవన్‌ అభిమానులు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కూడా జనసేన భారీగా ఓట్లు చీల్చుకోనుంది. అలాగే ఏలూరు లోకసభ నియోజకవర్గ పరిధిలో జిల్లా కేంద్రమైన ఏలూరుతో పాటు ఉంగుటూరు నియోజకవర్గంలోనూ జనసేన ప్రభావం గట్టిగా ఉంటుందని జిల్లాలో రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

మళ్లీ మూడో ప్లేసేనా….?

ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు ఏలూరులో ఆ పార్టీ రెండో ప్లేస్‌లో నిలవగా టీడీపీ ట్రయాంగిల్‌ ఫైట్‌లో కనీస పోటీ ఇవ్వలేక మూడో ప్లేస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఉంగుటూరులో ప్రజారాజ్యం మూడో స్థానంలో ఉన్నా ఇక్క‌డ ఆ పార్టీకి మాజీ మంత్రి కోట‌గిరి విధ్యారరావు రూపంలో బ‌ల‌మైన అభ్య‌ర్థి పోటీలో ఉండ‌డంతో 43 వేల ఓట్లు సాధించింది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న జ‌న‌సేన అంచనాలు… ఆ పార్టీ లెక్కల ప్రకారం తాడేపల్లిగూడెం జనసేన గెలిచే తొలి సీటు అని టాక్‌. ఇక్కడ నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు య‌ర్రా నారాయణస్వామి తనయుడు య‌ర్రా నవీన్‌ జనసేన నుంచి పోటీ చెయ్యడంతో ఆ పార్టీ గ్యారెంటీగా గెలుపు తమదే అన్న ధీమాతో ఉంది. ఇక మ‌రో నాలుగు నియోజకవర్గాల్లోనూ జనసేనకు బలమైన క్యేడర్‌ ఉండడంతో ఎన్నికల నాటికి గట్టి అభ్యర్థులను రంగంలో ఉంచితే జనసేన పశ్చిమగోదావరి జిల్లాలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీలకు ముచ్చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*