బాబును ఆ పాయింట్‌తో కొట్టొచ్చుగా జ‌గ‌న్‌..!

రాజ‌కీయాల్లో ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అదేవిధంగా రాజ‌కీయ పార్టీలు కూడా త‌మ త‌మ హ‌వాల‌ను కాపాడుకునేందుకు, పుంజుకునేలా చేయ‌డంలోను ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను టార్గెట్ చేస్తుంటాయి. ఇక‌, ఈ త‌ర‌హా వివాదం, ఆధిప‌త్యాల‌కు టీడీపీ-వైసీపీలే ముందుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ విప‌క్షం వైసీపీపై చేసిన ఆరోప‌ణ‌లు మిగిలిన ఏ పార్టీ కూడా ఎదుర్కొని ఉండ‌దు. న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభవం ఉన్న సీఎం చంద్ర‌బాబుకు కొర‌క‌రాని కొయ్య‌గా ప‌రిణ‌మించారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. అటు పార్టీ ప‌రంగా , ఇటు ప్ర‌భుత్వ ప‌రంగానూ జ‌గ‌న్.. సీఎం చంద్ర‌బాబుకు పూర్తిస్థాయిలో చుక్క‌లు చూపిస్తున్నారు. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అవినీతి గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు.

ఆ గొంతుకలేవీ?

అదేవిధంగా.. మంత్రుల బాగోతాల‌ను కూడా ఎండ‌గ‌డుతున్నారు. అయితే, అదేస‌మ‌యంలో టీడీపీ కూడా వైసీపీని తీవ్ర‌స్థాయిలో ఇరుకున పెడుతోంది. బీజేపీతో కుమ్మ‌క్క‌యింద‌ని వైసీపీపై ప‌ల్ల‌వి అందుకుంది. అంతేకాదు, వైసీపీకి ఓట్లేస్తే.. బీజేపీకి వేసిన‌ట్టేన‌ని చెప్పుకురావ‌డం ద్వారా ఓ విధ‌మైన రాజ‌కీయ గంద‌ర‌గోళానికి సైతం టీడీపీ తెర‌దీసింది. ఇన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. మ‌రి వైసీపీ ఈ రేంజ్‌లో టీడీపీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తోందా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కం. వైసీపీలో బ‌ల‌మైన గొంతుగా వినిపించే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాలు ఇటీవ‌ల కాలంలో మీడియా ముందుకు రావ‌డం లేదు. అధికార పార్టీని టార్గెట్ కూడా చేయ‌డం లేదు. మ‌రి ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ లేదా విజ‌య‌సాయి రెడ్డిలు మాత్ర‌మే టీడీపీపై పోరు చేస్తున్నారు.

ఫీడ్ బ్యాక్ లోపమా?

అయితే, టీడీపీ చేస్తున్న షార్ప్ క్రిటిక్ మాత్రం వైసీపీ నుంచి రావ‌డం లేదు. జ‌గ‌న్‌కు అందుతున్న ఫీడ్ బ్యాక్ లోప‌మో.. ఏమో తెలియ‌దు.. కానీ, టీడీపీపైనా భారీ రేంజ్‌లో విరుచుకుప‌డే అవ‌కాశం ఉండి కూడా జ‌గ‌న్ ఎందుకో ఆదిశ‌గా దృష్టి పెట్ట‌లేదు. ముఖ్యంగాఇటీవ‌ల జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ప‌రోక్షంగా చంద్ర‌బాబు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. క‌ర్ణాట‌క‌లో బీజేపీని ఓడించాల‌ని పిలుపునిచ్చారు. ఇక‌, ఏపీలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ వ‌ల్లే రాష్ట్రం న‌ష్ట‌పోయింద‌ని చెప్పిన బాబు.. ఇప్పుడు పాపం మొత్తం.. బీజేపీపై నెట్టేస్తున్నారు. ఇక‌, కాంగ్రెస్ త‌ర‌ఫు నుంచి కూడా అధికార పార్టీ టీడీపీని, పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న టీమ్‌ను టార్గెట్ చేయ‌ర‌ట‌! మ‌రి ఈ అవ‌కాశ వాద రాజ‌కీయాల‌ను జ‌గ‌న్ ఎండ‌గ‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ఎందుకు ఫోకస్ పెట్టరు?

బీజేపీకి-వైసీపీకిలోపాయికారీ ఒప్పందం ఉంద‌ని చెబుతున్న టీడీపీ నాయ‌కులు.. రాష్ట్రం ఇలా భ్ర‌ష్టు ప‌ట్ట‌డానికి కార‌ణ‌మైన కాంగ్రెస్‌తో కులికేందుకు రెడీ అవుతున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీ లు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకునేందుకు కూడా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయ‌ని తెర‌చాటున జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ అవ‌కాశ వాద రాజ‌కీయాల‌ను ఎందుకు ఫోక‌స్ చేయ‌డం లేదో అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు.. అభిమానులు. ఇప్ప‌టికైనా టీడీపీని మ‌రింత ఇరుకున పెట్టేలా నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌ల‌తో ముందుకు వెళ్లాల్స‌న అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*