ఎంత ప్లాన్ చేసినా అక్కడ జగన్ ను?

నెల్లూరు జిల్లాలో అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న పార్టీ టీడీపీ. విప‌క్ష వైసీపీతో పోలిస్తే వైసీపీ చాలా వీక్‌గా ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అధికారంలోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ పెద్ద‌గా చెప్పుకోడానికి కేడ‌ర్ కూడా లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక్క‌డ నుంచి ఇద్ద‌రు మంత్రులు చంద్ర‌బాబు కేబినెట్‌లో కీలక ప‌ద‌వుల్లోనే ఉన్నా రు. అయినా కూడా వారు నిమిత్త మాత్రులుగానే ఉంటున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారు తోంది. ముఖ్యంగా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేయ‌డం అంటే అంత ఈజీ కాద‌నే అభిప్రాయం వ్య‌క్తమ‌వు తోంది. ఈనేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇక్క‌డ పాగా వేయాల‌ని పెద్ద ఎత్తున మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్నారు. నిజానికి ఇక్క‌డ మేక‌పాటి గౌతం రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం నమోదు చేశారు.గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న ఈ ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీలో ఉంది.

ఆయననే ఖరారు చేస్తారా?

అంతేకాదు, ప్ర‌జ‌ల్లో మంచి ప‌లుకుబ‌డి కూడా సంపాయించుకుంది. గ‌త ఎన్నిక‌ల‌లో దాదాపు 31 వేల మెజారిటీతో ఇక్క‌డ గౌతం రెడ్డి విజయం సాధించారు. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన క‌న్న‌బాబు ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయారు. అలాంటి నేత‌ను ఓడించి ఇక్క‌డ పాగా వేయాలంటే.. టీడీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల్సిన ప‌రిస్థితి ఉంది. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. ఇక్క‌డ కీల‌క నాయకుడు ఒక‌రిని రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా ఈమ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్య పేరు ఖరారైద‌నే వార్త‌లు వ‌చ్చాయి. టీడీపీ నుంచి ఆనం రామనారాయణరెడ్డి నిష్క్రమణ తర్వాత దీటైన అభ్యర్థి కోసం అన్వేషించిన తెలుగుదేశం బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించాలని ప్రయత్నాలు చేపట్టింది.

రెండుసార్లు చర్చలు…..

ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే రెండు పర్యాయాలు బొల్లినేనిని పిలిపించుకొని చర్చలు జరిపారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. వివాదరహితుడు, వర్గాలకు అతీతుడుగా ఈయనకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆత్మకూరు తెలుగుదేశంలో పరిస్థితులు ఏమంత బాగాలేవు. టిక్కెట్టు కోసం ఆశించే నాయకుల పోటీ, ఆనం నిష్క్రమణ తదనంతర పరిణామాల క్రమంలో పార్టీ శ్రేణులు వర్గాలుగా చీలిపోయాయి. అదే.. బొల్లినేని అభ్యర్థి అయితే వీరందరూ సహకరించే అవకాశం ఉందని, మరో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు కూడా ఆయనకు సహకరిస్తారని భావించారు. జిల్లా నాయకత్వం ఈ మేరకు అన్నివిధాలా ఆలోచించి పావులు కదిపింది. విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది.

క్రియాశీల రాజకీయాల్లోకి…..

దీంతో చంద్రబాబు రెండు పర్యాయాలు బొల్లినేనితో మాట్లాడారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని, ఆత్మకూరు బాధ్యతలు తీసుకోవాలని కోరారు. జిల్లా పార్టీ నాయకులు సైతం బొల్లినేనితో మంతనాలు జరిపారు. అయితే ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా.. లేదా అనే అనుమానాలు కొనసాగుతున్న తరుణంలో బొల్లినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అంద‌రి మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టే ప‌ని చేస్తున్నారు. నిజానికి ఇక్క‌డ టీడీపీలో వ‌ర్గ పోరు ఎక్కువ‌గా ఉంది. గెలిచే మాట అటుంచి టికెట్ కోసం నువ్వా-నేనా అనే రేంజ్‌లో నేత‌లు పోట్లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో బొల్లినేని ఎంట్రీతో ప‌రిస్థితులు ఈ ఒక్క నాలుగు మాసాల్లోనే మారిపోతాయా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*