వాళ్లపై బాబు నిఘా…ఎందుకంటే…?

అప‌ర చాణిక్యుడిగా పేరు పొందిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇప్పుడు వైసీపీ నుంచి త‌న పార్టీలోకి వ‌చ్చిన ఎమ్మెల్యే ల‌పై నిఘాను ముమ్మ‌రం చేశారు. స‌ద‌రు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎవ‌రిని క‌లుస్తున్నారు? నియోజ‌క‌వ‌ర్గంలో ఏం చేస్తున్నారు? వ‌ంటి కీల‌క అంశాల‌పై ప్ర‌త్యేకంగా నివేదిక‌లు తెప్పించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వారు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? అనే విష‌యంపైనా కూపీ లాగుతున్నారు. వాస్త‌వానికి రాష్ట్రంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ పునర్విభజన జరుగుతుందని, విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న మేర‌కు ల‌బ్ధి చేకూరి మ‌రో 50 మంది ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంద‌ని బాబు భావించారు. అయితే, ఆయ‌న భావ‌న కేవ‌లం.. మాట‌ల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అయింది.

సీట్ల సర్దుబాటు…..

దీంతో ఇప్ప‌టికే పార్టీలో ఉన్న‌వారు.. వైసీపీ నుంచి వ‌చ్చిన సిట్టింగులు అంద‌రికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు స‌ర్దాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ నేప‌థ్యంలో కొంద‌రికి శ్రీముఖం చూపించే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. దీనిని గ‌మ‌నిస్తున్న కొంద‌రు నాయ‌కులు త‌మ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు న‌చ్చిన పార్టీలోకి వెళ్లాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం సిట్టింగులుగా ఉంటూనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రో పార్టీలోకి అయినా జంప్ చేసి టికెట్ సంపాయించాల‌ని చూస్తున్నారు. వీరిలో వైసీపీ ఎమ్మెల్యేలు.. వంత‌ల రాజేశ్వ‌రి, మ‌ణిగాంధీ, జ‌య‌రాములు, మంత్రి అఖిల ప్రియ వంటి కీల‌క నేత‌లు కూడా ఉన్నారు. వీరికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ ద‌క్కే ప‌రిస్థితి లేదని తెలుస్తోంది. ఈ విష‌యం ఇటీవ‌ల కాలంలో బాహాటంగానే వినిపిస్తోంది.

చేసిన తప్పుకు……

మ‌రోప‌క్క‌, వీరికి వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై భారీ అభిమానం ఉంది. వైఎస్ ఫ్యామిలీతో ఎడ‌తెగ‌ని బంధం కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ అవ‌కాశం రాక‌పోతే.. అక్క‌డికైనా వెళ్లి టికెట్ సాధించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. చేసిన త‌ప్పుకు చెంప‌లు వేసుకుని.. జ‌గ‌న్ పంచ‌న చేరాల‌ని భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈ విష‌యం ముందే ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు.. వీరిపై నిఘాను ముమ్మ‌రం చేశారు. వారు నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌పై నివేదిక‌లు తెప్పించుకున్నారు. ఈ క్ర‌మంలోనే వీరు `అస‌మ‌ర్ధులు` అనే ముద్ర‌వేసి భారీ ఎత్తున ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

అసమర్థులని ముద్ర వేసి…..

ఈ ఎమ్మెల్యేలు అస‌మ‌ర్థుల‌ని, తాను చేర‌దీసి వీరికి అవ‌కాశం ఇచ్చినా.. వినియోగించుకోవ‌డం లేద‌ని ప్ర‌చారం పెంచ‌నున్నారు. ఫ‌లితంగా వారికి నియోజ‌క‌వ‌ర్గంలోనూ, ఇత‌ర పార్టీల్లోనూ ప‌ర‌ప‌తి లేకుండా చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి త‌న పార్టీలోకి చేరిన వారు.. వింటే త‌న మాటే వినాలి.. లేకుండా భ‌విష్య‌త్తే లేకుండా చేస్తాను! అనే రేంజ్‌లో బాబు చ‌క్రం తిప్పుతున్నార‌ని స‌మాచారం. బాబు ఈ త‌ర‌హా ప్ర‌చారం చేస్తే ఆ ఎమ్మెల్యేలు టీడీపీలో మ‌న‌స్ఫూర్తిగా ఉండ‌నూ లేరు…ఇత‌ర పార్టీల్లోకి వెళ్లినా అక్క‌డ స‌క్సెస్ అవ్వాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి…టోట‌ల్‌గా వీరిని బాబు త‌న రాజ‌కీయ మంత్రాంగంతో భ‌లే డిఫెన్స్‌లో పెడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి ఈ ఎమ్మెల్యేలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*