ఇది బాబు మార్క్ అసెంబ్లీ….!

విజ‌న్ -2050 అంటూ ఊద‌ర గొడుతున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హారం అసెంబ్లీని ఆయ‌న న‌డిపిస్తున్న తీరును చూ స్తే ఇట్టే అర్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు రాజ‌కీయ నిపుణులు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు, వాటికి ప‌రిష్కారం చూపించేందుకు ప్ర‌దాన వేదిక అయిన అసెంబ్లీని చంద్ర‌బాబు ఎంత చిన్న చూపు చూస్తున్నారో తెలిస్తే.. ఎవ్వ‌రైనా నివ్వెర పోవాల్సిందే. అసెంబ్లీ అంటే దేవాల‌య‌మ‌ని, ఇక్క‌డ ప్ర‌జ‌లే దేవుళ్ల‌ని, వారి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి ప‌రిష్కారాలు చూపాల‌ని తెల్లారి లేస్తే.. నీతులు చెప్పే చంద్ర‌బాబు ఆ అసెంబ్లీకి ఎంత గౌర‌వం ఇస్తున్నారో.. తాజాగా స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాదే వివ‌రించారు.

ప్రశ్నకు జవాబులేవీ?

నవ్యాంధ్ర అసెంబ్లీలో ఇంతవరకూ జరిగిన 11 సెషన్లకు సంబంధించి ఇంకా 792 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. అంతేకాదు, కేవ‌లం 2017-18 బడ్జెట్‌ సమావేశాల నుంచి పరిశీలిస్తే 283 ప్రశ్నలకు జవాబులు ఇంతవరకు ఇవ్వలేదని ఆక్షేపించారు. మ‌రి అభివృద్ధిలో దూసుకుపోతున్నాన‌ని ప‌దే ప‌దే చెప్పే చంద్ర‌బాబు అస‌లు ఆయ‌న చేస్తున్న ప‌నుల‌కు సంబందించి అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఎందుకు స‌మాధానం ఇవ్వ‌లేక పోతున్నార‌నేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. నిజానికి అభివృద్ధి చేస్తే… దానిని చెప్పుకొనేందుకు ఇబ్బంది ఎందుకు? 283 ప్ర‌శ్న‌ల‌కు అస్స‌లు స‌మాధా న‌మే ఇవ్వ‌లేద‌ని సాక్షాత్తూ స్పీక‌రే వెల్ల‌డించ‌డాన్ని బ‌ట్టి బాబు నిర్వాకం ఎంత గ్రేట్‌గా ఉందో ఇట్టే అర్ధ‌మ‌వుతోంది.

దాటవేసే ధోరణేనా?

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల గురించి ఏదైనా స‌మ‌స్య చ‌ర్చించేందుకు ప్ర‌ధాన వేదిక అయిన అసెంబ్లీలోనే చంద్ర‌బాబు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. నేను చాలా పార‌ద‌ర్శ‌కంగా ఉన్నాను. నా పాల‌న అత్యంత నిజాయితీతో ఉంద‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు అండ్ టీం.. మొత్తానికి ఇన్ని ప్ర‌శ్న‌ల‌కు అస్స‌లు స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేత ధోర‌ణిని అవ‌లంబించ‌డం ఆయ‌న ప్ర‌జాస్వామ్యానికి ఏ రేంజ్‌లో విలువ ఇస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు విశ్లేష‌కులు. అనుభవం అంటేనా ఇదేనా అని ప్ర‌శ్నిస్తున్న‌వారు సైతం ఉన్నారు. ఒక‌ప‌క్క‌, విప‌క్షం స‌భ‌ల‌కు రావ‌డం లేద‌ని చెబుతున్న ప్ర‌భుత్వం వారు అడిగిన ఏ ప్ర‌శ్న‌ల‌కూ స‌మాధానం ఇవ్వ‌న‌ప్పుడు వ‌చ్చి ప్ర‌యోజ‌నం ఏంట‌ని అంటున్నారు ప‌లువురు విశ్లేష‌కులు. ఇదీ చంద్ర‌బాబు మార్కు అసెంబ్లీ స‌మావేశాలు!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*