లేదు లేదంటూనే.. దోస్తీ.. రీజనేంటి…?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒకింత భ‌య‌ప‌డుతున్నారు! అని త‌ర‌చుగా ఇటీవ‌ల కాలంలో మీడియాలో వినిపిస్తున్న మాట‌. అయితే, దీనిని మాత్రం బాబు ఎప్ప‌టిక‌ప్పుడు తోసిపుచ్చుతూనే ఉన్నారు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని అంటూనే ఉన్నా రు. దేశంలో తానే సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ నాయ‌కుడిన‌ని, త‌న‌కు తిరుగు లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. అయితే, తాజాగా ఆయ‌న చేస్తున్న ప‌నుల‌ను గ‌మ‌నిస్తే.. ఆయ‌న ఏవో కొన్ని శ‌క్తుల‌కు భ‌య‌ప‌డుతున్నార‌నే అనిపిస్తోంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. సోమ‌వారం పెట్రో, డీజిల్ ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ ఇచ్చిన పిలుపులో భాగంగా బంద్ పాటించాల‌ని వివిధ ప‌క్షాలు నిర్ణ‌యించాయి. ఆసేతు హిమాచ‌లం నుంచి మొద‌లైన బంద్ ప్ర‌భావం అన్ని కార్యాల‌యాలు, ప‌నుల‌పైనా ప‌డింది.

బంద్ చేయకుండా….నిరసనలతోనే…..

ఇక‌, ఈ బంద్‌ను విజయ‌వంతం చేసే దిశ‌గా కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిస్తున్న పార్టీలు నిర్ణ‌యించాయి. అయితే, పెట్రోలు ధ‌ర‌ల‌ను, డీజిల్ ధ‌ర‌ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు మాత్రం.. మొద‌ట్లో ఈ బంద్‌లో పాల్గొనేది లేద‌ని చెప్పా రు. తాను బంద్‌కు వ్య‌తిరేక‌మ‌ని, అయితే, శాంతి యుతంగా మౌన ప్ర‌ద‌ర్శ‌న‌, నిర‌స‌న వ్య‌క్తం చేస్తామ‌ని అన్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఈ బంద్‌కు కాంగ్రెస్ నేతృత్వం వ‌హించ‌డ‌మే! మ‌న‌సులో కాంగ్రెస్‌తో దోస్తీ చేయాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల ట్యూన్ స‌హా టీడీపీ అభిమానుల ఆలోచ‌న కూడా కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఉండ‌డంతో చంద్ర‌బాబు ఆ దిశ‌గా ఆలోచ‌న‌ను విమ‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇక్కడ కూడానా….?

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు.. బంద్‌కు త‌మ మ‌ద్ద‌తు ఉండ‌ద‌ని పేర్కొంటూ.. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావుతో ప్ర‌క‌ట‌న చేయించారు. తాము ఈ బంద్‌లో పాల్గొన‌డం లేద‌ని చెప్పారు. అయితే, అనూహ్యంగా ఆదివారం రాత్రి మాత్రం సైలెంట్‌గా ఈ బంద్‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను మోడీ ఇంకా పెంచుతారేమో? అంటూ ప్ర‌శ్నార్థ‌కంగా మాట్లాడిన బాబు.. దీనికి వ్య‌తిరేకంగా జ‌రిగే బంద్‌కు మ‌ద్ద‌తిస్తున్నార‌ని క‌ళా వెంక‌ట్రావు ఓ ప్ర‌క‌ట న‌లో మ‌ద్ద‌తిచ్చారు. దీనిని బ‌ట్టి.. చంద్ర‌బాబు ఎంత లేద‌ని అంటున్నా.. కాంగ్రెస్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని సాగుతున్నార‌న డానికి ఇది ప్ర‌బ‌ల నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మొత్తానికి ఇప్ప‌టికే తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అయిన బాబు.. ఇప్పుడు ఇక్క‌డ కూడా నెమ్మ‌దిగా కాంగ్రెస్‌తో క‌లిసి వెళ్లేలా పావులు క‌దుపుతున్నారు.