బాబు ఫైనల్ డెసిషన్ ఇదేనా …!!

తెలంగాణ ఎన్నికల్లో టిడిపి ఖచ్చితంగా కోరుకుంటున్న స్థానాలను ఫైనల్ చేసేసింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు ఈ జాబితా పెట్టింది. తొలుత 40 స్థానాలు తరువాత 20 స్థానాలు కోరుకుంది టిడిపి. అయితే కాంగ్రెస్ మాత్రం ముందు నుంచి 14 స్థానాలు మాత్రమే టిడిపి కి కేటాయించేందుకు సిద్ధమైంది. తాజాగా కాంగ్రెస్ ఇస్తానన్న స్థానాలకు తోడు మరో మూడు చోట్ల టికెట్స్ ఆశిస్తుంది టి టిడిపి. ఈ స్థానాల్లో తమ పార్టీకి బలమైన అభ్యర్థులతో పాటు విజయావకాశాలు బలంగా ఉన్నాయని తమ్ముళ్లు నమ్మకంతో వున్నారు. కాంగ్రెస్ 14 స్థానాలు టిడిపికి కేటాయిస్తామని చెబుతున్నా అవి ఎక్కడివో మాత్రం ఇప్పటివరకు ఫైనల్ చేయలేదు. దాంతో ఒక జాబితా రూపొందించి కాంగ్రెస్ అధిష్టానం ముందు పెట్టింది టిడిపి.

ఆ…. స్థానాలు ఇవే …

కూకట్ పల్లి, శేర్లింగంపల్లి, ఉప్పల్, నర్సంపేట లేదా వరంగల్ వెస్ట్, మహబూబ్ నగర్, మక్తల్, సత్తుపల్లి, ఆలేరు లేదా నకిరేకల్, సనత్ నగర్, ఎల్బీ నగర్, అశ్వారావుపేట, ఖమ్మం, బాల్కొండ లేదా బాన్స్ వాడా, రాజేంద్ర నగర్, జూబ్లీహిల్స్ , పఠాన్ చెర్వు, ముషీరాబాద్ స్థానాలను టిడిపి ఆశిస్తుంది. ఈ సీట్లలో వెనక్కి తగ్గేది లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే టి టిడిపి కోరుతున్న స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు జోరుమీద వున్నారు.

టిక్కెట్ దక్కకుంటే…..

వారు తమకే టికెట్ వస్తుందన్న ఆశతో ప్రచారం సైతం ముమ్మరంగా సాగిస్తున్నారు. పొత్తులో భాగంగా తమకే సీటు దక్కుతుందన్న నమ్మకంతో ఇప్పటికే అంతా సిద్ధం చేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. నేడో, రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే తాము అనుకున్న సీట్లు కేటాయించకపోతే రెబల్స్ గానైనా బరిలోకి దిగేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. జాబితా పై మార్పు చేర్పులు ఏమున్నా ఇక టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ నేరుగా చంద్రబాబు తో మాట్లాడి ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*