అదే బాబు ఫ్యూచ‌ర్ తేల్చేస్తుందా..?

ఏపీ సీఎం చంద్ర‌బాబు బీసీ గ‌ర్జ‌న పేరిట భారీ స‌భ‌కు శ్రీకారం చుట్టారు. ఈ నెల 27న రాష్ట్ర స్థాయి బీసీ సభ నిర్వహించ డానికి బాబు సంక‌ల్పించారు. సుమారు 5 లక్షల మందితో ఈ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లోకాని, జాతీయ రహదారిలోని హూండాయ్‌ షోరూమ్‌ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కానీ సభను నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. జిల్లా నాయకులు అంతా సమావేశమైన తరువాత దీనిపై ఒక స్పష్టత వస్తుంది. ఇక కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ మధ్యలో ఈ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బీసీలను మచ్చిక చేసుకోవడానికి…..

రాష్ట్రంలో ఈ సారి త్రిముఖ పోటీ జరుగనుండడంతో అన్ని వర్గాల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీ లు, కులాలు, వర్గాల వారీ మీటింగ్‌లకు సిద్ధమవుతున్నాయి. బీసీల పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ బీసీలకు మరింత దగ్గర కావాలని ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీసీల కోసం పార్టీ చేస్తున్న కార్యక్రమాలు వారికి రాజకీయంగా, ఆర్థికంగా ఇస్తున్న ప్రాధాన్యతలను వివరించడంతోపాటు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించే విషయాలను కూడా పరిశీలించడానికి ఈ సభ నిర్వహించనున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బీసీ వర్గాలన్నీ ఆ పార్టీకి అండగానే ఉన్నాయి. ఇటీవల బాగా చైతన్యమైన బీసీ వర్గాలు మరింత ప్రాధాన్యతను కోరుకున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఇతర పార్టీల వైపు కూడా దృష్టి సారించారు.

సభ ద్వారా వరాలు……

ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ బీసీలను మరింత దగ్గర చేసుకోవడం కోసం ఈ సభ నిర్వహిస్తోంది. ఈ సభతో బీసీల ప్రా ధాన్యం మరింత పెరిగే అవకాశమున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. చట్టసభల్లో అన్ని పార్టీలు బీసీలకు అవకాశమి వ్వాలని కార్పొరేట్‌ పదవులు, ఇతర పార్టీ పదవుల్లో కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాలని బీసీలు డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌ధానంగా ఇటీవ‌ల చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కాపుల‌కు బీసీ వ‌ర్గాల్లో 5% రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ.. తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీనిపై పెద్ద ఎత్తున బీసీలు గ‌ర్జ‌నలు నిర్వ‌హించారు.

జగన్ స్టేట్ మెంట్ తో……

ఇదే టైంలో జ‌గ‌న్ కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల అంశం త‌న ప‌రిధిలోనిది కాద‌ని.. ఇది కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉంటుంద‌ని చెప్ప‌డంతో బీసీల్లో త‌మ ఓటు బ్యాంకుకు ఎక్క‌డైనా తేడా కొడుతుందా ? అన్న ఆందోళ‌న సైతం టీడీపీ వ‌ర్గాల్లో ఉంది. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ట్ర‌యాంగిల్ ఫైట్ నేప‌థ్యంలో రాష్ట్ర జ‌నాభాలో అధిక‌శాతం ఉన్న బీసీల‌ను భారీగా త‌మ వైపున‌కు తిప్పుకుంటేనే విజ‌యం సాధ్య‌మ‌వుతుంద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు ఇప్పుడు మ‌ళ్లీ బీసీల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. కాపు రిజ‌ర్వేష‌న్ల స్టాండ్ విష‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరిలో టీడీపీ వ్య‌తిరేక‌త భారీ ఎత్తున పెరిగే అవ‌కాశం ఉంటుంద‌న్న టాక్ ఉండ‌గా…. విప‌క్షాలు దీనినే అస్త్రంగా మ‌లుచుకోనున్నారు. వీటిని ముందుగానే గ‌మ‌నించిన చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఈ స‌భ‌కు శ్రీకారం చుట్టార‌ని తెలుస్తోంది. మ‌రి ఎన్నిక‌ల నాటికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*