అంతా నువ్వే చేసావు …

ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇక పూర్తిగా అటక ఎక్కినట్లే. లోక్ సభలో ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చేశారు. స్టేటస్ కి బదులు ప్యాకేజి ఇస్తే చాలని ఎపి సీఎం చంద్రబాబు అంగీకరించడం వల్లే అది ఇచ్చామన్నారు ప్రధాని. ప్యాకేజి సూపర్ అంటూ ఎన్డీయే లో ఉండగా అరుణ్ జైట్లీ సమక్షంలో స్వయంగా ప్రకటించిన బాబు వైసిపి ట్రాప్ లో పడి యూటర్న్ కొట్టేశారన్నారు. పదునైన మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు ఎపి లో హాట్ టాపిక్ గా మారాయి. తప్పంతా చంద్రబాబు చేసినదే అన్న రీతిలో మోడీ ఎటాక్ చేశారు. దీనిపై ఏపీలో విపక్షాలు తెలుగుదేశం పై దుమ్మెత్తిపోయడం మొదలు పెట్టేశాయి.

వైసిపి జనసేన బాబు పై విమర్శల వర్షం …

లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ ఇలా ముగిసిందో లేదో ఎపి లోని విపక్ష పార్టీలు చంద్రబాబు వైఖరే రాష్ట్రానికి అన్యాయం చేసిందని దుమ్మెత్తిపోశాయి. పార్లమెంట్లో చర్చ మొదలు కాగానే పవన్ ట్విట్టర్ లో చెలరేగిపోయారు. ప్యాకేజి వద్దు మొర్రో అన్నా విన్నారా ఇప్పుడు చూడండి అంటూ పవన్ వివిధ రకాల ట్వీట్ లతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇక వైసిపి ఎంపీలు ఢిల్లీ లో మాట్లాడుతూ బాబు తప్పుడు నిర్ణయాలే కొంప ముంచాయని ఆరోపించారు. ఇలా నలువైపులా ప్రధాని చేసిన వ్యాఖ్యలు బాబు కౌంటర్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారి తీశాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*