విభజన తీరును మోడీ అడ్వాంటేజ్ గా మార్చుకున్నారే…?

ఎపి విభజన అంశాన్ని అవిశ్వాసంపై చర్చలో ప్రధాని మోడీ తమ పార్టీకి అనుకూలంగా మల్చుకోగలిగారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఇలానే ఉంటుందని తెలుగు తల్లిని రెండు ముక్కలు చేసిన విధానం ఇండియా పాకిస్తాన్ మాదిరి విభజించిందని చెప్పుకొచ్చారు. వాజ్ పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎక్కడా చిన్న గొడవ లేదని ఆయా రాష్ట్రాలు చక్కగా అభివృద్ధి చెందుతున్నాయని ఉదాహారణ చూపుతూ ఏపీని రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాంగ్రెస్ దగా చేసిందని ఆరోపించారు. వాస్తవానికి అవిశ్వాసం సందర్భంగా విభజన జరిగిన తీరులో బిజెపి విపక్షంగా వ్యవహరించిన విధానాన్ని టిడిపి కడిగి పారేయాలి. మెజారిటీ లేకుండా, సభ ఆర్డర్ లో లేకుండా కాంగ్రెస్ నిర్వాకాన్ని దాన్ని సమర్ధిస్తూ బిజెపి వంత పాడటాన్ని ఎత్తి చూపాలి.

టిడిపి అవకాశాన్ని మోడీ వాడేశారు …

విభజన, చట్టప్రకారం, రాజ్యాంగం ప్రకారం జరగలేదని స్పష్టంగా లెక్కలతో వివరిస్తూ టిడిపి ఎంపీలు పూర్తి స్థాయిలో తమ ప్రసంగాలు సాగించలేకపోయారు. కానీ మోడీ ఇలాంటివి చక్కగా వినియోగించుకోవడంలో దిట్ట. దాంతో ఆయన టిడిపి వేయాలిసిన ప్రశ్నలను కాంగ్రెస్ పై చక్కగా ప్రయోగించి ప్రధాన ప్రతిపక్షాన్ని నోరెత్తకుండా చేశారు. అలాగే కేసీఆర్ పై పొగడ్తలు విసురుతూ ఆ పార్టీ నుంచి నిరసన ఎదురుకాకుండా జాగర్త వహించారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో రాజకీయ అవసరాల కోసం ఆ పార్టీ చేసే పనులకు ఎపి విభజన సాక్ష్యంగా చూపిస్తూ పూర్తి అడ్వాంటేజ్ తీసుకున్నారు మోడీ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1