ఈ విషయంలో మాత్రం బాబుకు మోడీయే స్ఫూర్తట…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజయం సాధించాలి. తిరిగి సీఎం సీటును సాధించ‌డం ద్వారా త‌న రికార్డునుతానే తిర‌గ రాసుకోవాలి! ఇదీ.. ఇప్పుడు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యం. అయితే, దీనిని సాధించ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితిలో అంత ఈజీ కాదు. ప్ర‌ధానంగా రాజ‌కీయంగా గ‌ట్టి పోటీ ఎదురు కానుంది. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా ఏపీలో వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌నున్నాయి. అదేవిధంగా జ‌గ‌న్ పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున పోటీ ఇస్తోంది. ఇదిలావుంటే, ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన ఒంట‌రి పోరుతో దంచి కొట్టేందుకు స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ముందుకు సాగుతోంది. ఇక‌, టీడీపీలో నేత‌ల మ‌ధ్య స‌రైన స‌మ‌న్వ‌యం ఎంత చూద్దామ‌న్నా క‌నిపించ‌డం లేదు. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఒకింత పార్టీని ఇబ్బంది పెడుతుంటే.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి మ‌రోలా ఉంది.

ఎంత దాచాలన్నా…..

టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి, దందాలు, వ్యాపార లావాదేవీలు, భూక‌బ్జాలు ఎంత దాచి పెట్టాల‌న్నా దాగి ఉండ‌డం లేదు. ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌ల్లోనే క‌థ‌నాలు పూట‌కొక‌టిగా తేట‌తెల్లం అవుతున్నాయి. మ‌రి ఇన్ని విధాలుగా ఎదురుగాలి వీస్తుంటే.. చంద్ర‌బాబు ఏంచేయాలి? ఆయ‌న ఎలా ముందుకు వెళ్లాలి? రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న చేయాలా? పార్టీని క్ర‌మ‌శిక్ష‌ణలో పెడుతూనే త‌మ్ముళ్ల దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాలా? ఇవీ ఇప్పుడున్న ప్ర‌శ్న‌లు. అయితే, చంద్ర‌బాబు ఇవ‌న్నీ చేసినా.. కూడా ఎన్నిక‌ల స‌మ‌యానికి ప‌రిస్థితి తారుమార‌య్యేలానే ఉంది. కొంద‌రు ఎమ్మెల్యేలు నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పోనీ.. వీరిని మారిస్తే.,. అయినా ఓట్లు ప‌డ‌తాయా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే!

సంక్షేమ పథకాలను…..

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. తాను చేస్తున్న ప‌నులు, ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాలు స‌మాజంలో స‌గం మందికి కూడా చేర‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వీటిపై జోరుగా ప్ర‌చారం చేయాల‌ని, క‌నీసం వ‌చ్చే ఆరు మాసాలు ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు బోధిస్తున్నారు. అయితే, చాలా మంది నేత‌లు దీనికి కూడా సుముఖంగా లేరనే తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు.. ప్ర‌చార బాట‌నే ఎంచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి నుంచి ఆరు మాసాల పాటు.. రాష్ట్రంలోని అన్ని టీవీ ఛానెళ్లు, ప‌త్రిక‌ల్లో పెద్ద ఎత్తున వారానికి నాలుగు రోజుల పాటు ప్ర‌చారం అదిరిపోయేలా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తాజాగా అమ‌రావ‌తి వ‌ర్గాలు చెబుతున్నారు.

సమయం..సందర్భం లేకుండా…..

ఈ నేప‌థ్యంలోనే స‌మ‌యం సంద‌ర్భంతో సంబంధం లేకుండానే చంద్ర‌బాబు ప్ర‌చార ప‌ర్వానికి తెర‌దీశార‌ని అంటున్నారు. తాజాగా సోమ‌వారం అన్ని ప‌త్రిక‌ల్లోనూ పేజీల‌కు పేజీలు ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. నిజానికి ఈ ప్ర‌క‌ట‌న‌ల‌కు ప్ర‌స్తుతం చంద్ర‌బాబు చేస్తున్న ప‌నుల‌కు సంబంధం లేదు. అయినా కూడా చంద్ర‌బాబు రోజులో వినూత్న రీతిలో ప్ర‌చారం చేయ‌డం ద్వారా పార్టీని నిల‌బెట్టుకోవాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు ఇదొక్క‌టే మార్గ‌మ‌ని ఆయ‌న త‌ల‌పోస్తున్నార‌ట‌. దీనికిగాను మ‌రో విష‌యాన్ని కూడా చెబుతున్నారు.

రూ.300 కో్ట్ల ఖర్చుతో…..

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో ఉన్నందున ఖ‌ర్చు ప్ర‌భుత్వ ఖాతాలోకే వెళ్తుంద‌ని, పార్టీకి మాత్రం ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సుమారు 300 కోట్ల‌ను ప్ర‌చారానికి కేటాయించాల‌ని ప్రాధ‌మికంగా నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యంలో కొస‌మెరుపు ఏంటంటే.. గ‌త ఎన్నిక‌ల్లో కేంద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏర్పాటు స‌మ‌యంలో దాదాపు రూ. 1000 కోట్ల‌కు పైగానే బీజేపీ త‌ర‌ఫున ఖ‌ర్చు చేశారు. ఈ స్ఫూర్తితోనే చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌చార‌పర్వం త‌ల‌కెత్తుకున్నార‌ని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*