మోదీ లెక్కను సరిచేస్తారా ..?

narendramodi-vs-chandrababunaidu

ఏ ముఖం పెట్టుకుని ఏపీకి ప్రధాని వస్తారు. చచ్చామో బతికామో చూద్దామనా ..? ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న మాట. ఇదే డైలాగ్ కాంగ్రెస్ తో కలవకముందు ఆ పార్టీపై చెప్పారు బాబు. రాహుల్ ఏ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తారు చచ్చామా బతికమా చూద్దామని కాబోలు అంటూ కాంగ్రెస్ తో దోస్తీకట్టకముందు చెప్పిన మాట. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాబు మరోసారి యూటర్న్ కొట్టి కాంగ్రెస్ కి జై కొడుతున్నారు. మోడీని ఛీ ఛీ అంటున్నారు. ఎవరన్నా ప్రశ్నిస్తే ఇదంతా నాకోసం కాదు దేశం కోసం ప్రజాస్వామ్యాన్ని బతికించడానికె అన్నది గుర్తుపెట్టుకోవాలంటున్నారు. ఇలా మాటలు ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చే ఎన్నికల్లో మైలేజ్ టార్గెట్ గా ఆయన వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

బాబు ఫార్ములానే….

ఇప్పుడు బిజెపి కూడా చంద్రబాబు ఫార్ములాలోకి మారిపోయింది. తమ నేతలను టిడిపి అడ్డుకున్నట్లే చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాల్లోకి చొరబడి ఏపీకి తమపార్టీ చేసిన అన్యాయం ఏమిటని నిలదీయడం కాకినాడ నుంచి మొదలైంది. ఇలా బిజెపి క్యాడర్ ను మోటివేట్ చేసి వారిని ఉత్సహపరిచింది స్వయంగా ప్రధాని మోడీ కావడం గమనార్హం. గుంటూరు లో ప్రధాని సభను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున టిడిపి కాంగ్రెస్ పార్టీలు సమాయత్తం కావడంతో ఇంటలిజెన్స్ నివేదికలు ప్రధాని కి చేరాయి.

కడిగేయాలనడంతో…..

దాంతో ఇదే వ్యూహంతో టిడిపిని నిలదీస్తే సరిపోతుందని లెక్కేసిన ప్రధాని నేరుగా ఎపి క్యాడరుతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది చెప్పుకొచ్చారు. అంతే కాదు ఎక్కడికక్కడ చంద్రబాబును కడిగేయాలి అంటూ పిలుపునివ్వడమే బాబును కార్యకర్తలు ఎదిరించే సాహసానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లను అడ్డుకున్న రీతిలోనే టిడిపి వేస్తున్న అడుగులు గమనించిన ప్రధాని పసుపు దళం స్టైల్ ని కమలదళం ఫాలో కావాలని దిశా నిర్దేశం చేయడంతో రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీల కార్యక్రమాలు ఘర్షణ పూరితంగా మారి పోలీసులకు, మీడియా కు పని కల్పించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*