ఏపీలో ఆ నోటు ఎందుకు మాయం అయ్యింది ..?

దేశంలో ఎక్కడ లేని కరెన్సీ కొరతను ఎపి ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రెండువేల రూపాయల నోటు మార్కెట్ లో సర్క్యులేషన్ లో లేకుండా పోతుంది. బ్యాంక్ లకు ఈ నోటు తిరిగి జమకావడం తక్కువైపోయింది. దాంతో కరెన్సీ కష్టాలు పీక్ లో వున్నాయి ఏపీలో. దాదాపు 99 శాతం కరెన్సీ ని నోట్ల రద్దు తరువాత ముద్రించినట్లు రిజర్వ్ బ్యాంక్ చెబుతుంటే మరి రెక్కలొచ్చిన పెద్దనోట్లు ఎక్కడికి ఎగిరిపోతున్నాయో అంతు చిక్కని మిస్టరీగా మారింది.

బ్యాంక్ లు ఏటీఎం ల చుట్టూ తిరగలేక …

సామాన్యులు నోట్ల రద్దు తరువాత ఎంతటి బాధ అనుభవించారో అదే స్థాయిలో ఇప్పుడు బ్యాంక్ లలో అగచాట్లు పడుతున్నారు. లక్ష రూపాయలు కావాలన్న వారికి కనీసం 50 వేలరూపాయలు కూడా బ్యాంక్ లు ఇవ్వడం లేదు. పోనీ ఏటీఎం లలో నగదు నిల్వలు లేక నో క్యాష్ బోర్డు లు వెక్కిరిస్తున్నాయి. చాలా బ్యాంక్ లలో డబ్బు కోసం జనం గొడవకు దిగే పరిస్థితి ఎదురౌతుంది. ఖాతాదారులు నిత్యం అక్కడక్కడా బ్యాంక్ లలో వివాదాలు చేయడం రొటీన్ గా మారుతుంది. ఇది ప్రస్తుతానికి ఎపి సర్కార్ కి తలనొప్పి తెప్పిస్తుంటే కేంద్ర సర్కార్ సైతం సరిదిద్దే చర్యలే చేపట్టడం లేదు

పార్టీలు సైడ్ చేశాయా ….

రాబోయే ఎన్నికల్లో ఓటుకు రెండువేలరూపాయలు బట్వాడా చేయడానికి ప్రధాన రాజకీయ పక్షాలు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వచ్చిన రెండువేలరూపాయలు తిరిగి బ్యాంక్ లకు వెళ్లడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్లే నగదు కు కృత్రిమ కొరత ఏర్పడుతుందని అంటున్నారు. విశ్లేషకులు. మరి కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఏమి చేయబోతున్నాయో వేచి చూడాలి .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*