ఆపరేషన్ గరుడ ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఆపరేషన్ గరుడ షురూ అయిందన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల అనుమానం. ఎనిమిదేళ్ల నాటి కేసును తిరగదోడటమంటే దీని వెనక ఎవరున్నారన్నది తేలాల్సి ఉందన్నారు. మహారాష్ట్ర కోర్టు చంద్రబాబుతో మరికొందరికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ అప్పట్లో బాబ్లీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇప్పుడు ఈ కేసు తిరగదోడి నాన్ బెయిల్ బుల్ వారెంట్ చేస్తారా? అని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

శివాజీ చెప్పినట్లుగానే…..

సినీనటుడు శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్ గరుడ ఆంధ్రప్రదేశ్ లో స్టార్టయిందన్నారు. ఇటీవల సినీనటుడు శివాజీ ఏపీ ముఖ్యమంత్రికి నోటీసులు వస్తాయని, ఆ సమాచారం తనకు బీజేపీ వర్గాల ద్వారా తెలిసిందని మీడియా ఎదుట చెప్పిన సంగతి తెలిసిందే. శివాజీ ఈ ప్రకటన చేసిన నాలుగైదు రోజులకే మహారాష్ట్ర నుంచి నోటీసులు రావడాన్ని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణలో దీనిపై ప్రచారం……

ఆరోజు కేసును ఉపసంహరిచుకుంటున్నామని మహారాష్ట్ర పోలీసులు చెప్పారని, అయితే మళ్లీ తిరగదోడటంలో ఆంతర్యమేంటని మంత్రి నక్కా బాబు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఈ నోటీసులను అందిపుచ్చుకుంటోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులను పక్కాగా ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము ఆనాడు ఉద్యమిస్తే తమకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ నోటీసులపై కేసీఆర్ స్పందించాలని కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*