పళని ప్లానింగే వేరయా….??

palaniswamy-planning-superb

తమిళనాడులో ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అన్నదానికి ఉత్కంఠ వీడటం లేదు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోకవర్గాలు పద్ధెనిమిదింటిని పక్కన పెట్టి తొలుత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మరణంతో ఖాళీ అయిన తిరుప్పర కుండ్రంలకు మాత్రమే తొలుత ఎన్నికలు జరుపుతారా? అన్న చర్చ తమిళనాడులో విస్తృతంగా జరుగుతోంది. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. శశికళ జైలుకు వెళ్లిన దగ్గర నుంచి పళని, పన్నీర్ లు చేతులు కలపడం వరకూ కమలం పెద్దలు అన్నీ దగ్గరుండి చూసుకున్నారన్న టాక్ ఎటూ ఉండనే ఉంది.

అన్ని చోట్లా ఉప ఎన్నికలు జరిగితే…..

దీంతో తొలుత రెండు స్థానాలకే ఎన్నికలు జరిపి తర్వాత 18 స్థానాలకు ఎన్నికలు జరుపుతారన్న ప్రచారం తమిళనాట విస్తృతంగా జరుగుతోంది. ఇప్పుడు అనర్హత వేటు పడిన 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిపితే పళని సర్కార్ దాదాపు కూలి పోవడం ఖాయంగా కన్పిస్తోంది. పద్ధెనిమిది స్థానాల్లో కనీసం ఎనిమిది స్థానాలను అధికార అన్నాడీఎంకే చేజిక్కించుకోకుంటే ఖచ్చితంగా పళని ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుంది. అందుకోసమే ఈ ఎన్నికలను వాయిదా వేయించుకునే ఆలోచనలో పళనిసర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

సుప్రీంకోర్టు తలుపుతట్టి….

అనర్హత వేటును మద్రాస్ హైకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే మద్రాస్ హైకోర్టు తీర్పున సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కాని టీటీవీ దినకరన్ మాత్రం తమకు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. అందువల్ల ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఆరు నెలల్లోపు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టను దీనిపై ఎవరైనా ఆశ్రయిస్తే ఈ ఎన్నికలు పెండింగ్ లో పడతాయి. దీనిపై సుప్రీంకోర్టులో ఎవరిచైతనైనా సవాల్ చేయిస్తే కొంతకాలం ఈ 18 ఎన్నికలు వాయిదా పడే అవకాశముంటుందని, తద్వారా సత్వరం ముంచుకొచ్చే ప్రమాదం ఏదీ లేదని పళనిస్వామి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎవరి ప్రయత్నాల్లో వారు…..

అయితే కరుణానిధి మృతితో ఖాళీ అయిన తిరువారూర్ స్థానానికి ఫిబ్రవరి 7లోపు ఎన్నికలు జరుపుతామని ఎన్నికల కమిషన్ న్యాయస్థానానికి తెలిపింది. మరో స్థానమైన తిరుప్పరకుండ్రం అంశం కోర్టు పరిధిలో ఉండటంతో దాని గురించి తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే 20 శాసనసభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యాయి. అధికార పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో విపక్షాలు కూటమిగా ఏర్పాటయ్యేందుకు కూడా కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు ఆ 18 స్థానాలకు జరిగే అవకాశం ఇప్పట్లో లేదన్నది విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*