పందెం కోడి 2 స్మాల్ రివ్యూ!

తమిళ హీరో విశాల్ ను మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం ‘పందెంకోడి’. ఈచిత్రాన్ని లింగుస్వామి డైరెక్ట్ చేసాడు. అప్పటిలో ఈచిత్రం తమిళంలో..తెలుగులో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దాని సీక్వెల్ ‘పందెం కోడి 2 ‘ వచ్చింది. దసరా కానుకగా వచ్చినా ఈచిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం..ఈమూవీలో హీరోగా విశాల్..హీరోయిన్ గా కీర్తి సురేష్..విలన్ గా వరలక్ష్మి నటించారు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో…..

ఇప్పటివరకు టాలీవుడ్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి..చాలావరకు ఫెయిల్ అయ్యాయి. ‘పందెం కోడి 2 ‘ కూడా అదే బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. సీమ‌లో జరుగుతున్న జాత‌ర‌లో తిండిద‌గ్గర జ‌రిగిన చిన్న గొడ‌వ‌.. చిలికి చిలికి గాలివాన‌లా మారి రెండు ఉరులకు గొడవ కారణం అవుతుంది. మరి ఆ గొడవ ఎంతవరకు వెళ్ళింది? ఎంతమంది చనిపోయారు అనేది మిగిలిన సినిమా.

ఫస్ట్ హాఫ్ మొత్తం…..

ఫస్ట్ హాఫ్ మొత్తం కీర్తి సురేష్ చేసి కొన్నికొన్ని చిలిపి అల్లర్లు..విశాల్, కీర్తిల మధ్య వచ్చే లవ్ సీన్స్ తోపాటు సినిమాకు సంబంధించి కొన్ని కొన్ని సీన్స్ తో ఫస్ట్ హాఫ్ సాఫీగానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం రీవేంజ్ డ్రామాగా నడుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా గాడి త‌ప్పిపోయి భారంగా అనిపిస్తోంది. విశాల్ నుండి కోరుకునే మాస్ ఎలెమెంట్స్ ఇందులో లేకపోవడంతో…జనాలు బోర్ గా ఫీల్ అయ్యారు. సెకండ్ హాఫ్ ని ఎందుకో లింగుస్వామి సరిగా ట్రీట్ చేయలేకపోయాడు. విశాల్ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు రాజ్ కిరణ్ తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో వరలక్ష్మి..విశాల్ మధ్య వచ్చే సీన్ కొంతవరకు బాగానే ఉంటుంది.

బిలో యావరేజ్…..

విశాల్ నటన చాలా బాగుంది. వరలక్ష్మి నటన గురించి అయితే చెప్పనవసరం లేదు. ఈసినిమాకి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం కూడా తేలిపోయింది. ఇక శక్తివేల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలో నటించిన అందరు పర్లేదు అనిపించే రీతిలో నటించారు. ఇక ఫైనల్ చెప్పాలంటే ద‌ర్శకుడు లింగుస్వామి ఈసినిమాను డీల్ చేయడం విషయంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. తమిళంలో ఈచిత్రం ఆకట్టుకున్న తెలుగులో మాత్రం ఆడడం కష్టమే. ఓవరాల్ గా ఈచిత్రం బిలో యావరేజ్ గా నిలించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*