ప‌రిటాల ఫ్యామిలీకి బాబు కండిషన్ ఇదే…?

ప‌రిటాల ఫ్యామిలీ! ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఉమ్మ‌డి ఏపీ స‌హా ప్ర‌స్తుత ఏపీలోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక స్తానం సంపాయించుకున్న ప‌రిటాల కుటుంబం రాజ‌కీయంగా ఫ్యూచ‌ర్‌లో ఎలాంటి అడుగులు వేయ‌నుంది? ఎలా ముందుకు వెళ్ల‌నుంది? అనే అంశాలు చ‌ర్చ‌కు వ‌స్త‌న్నాయి. ప్ర‌స్తుతం ప‌రిటాల ర‌వి స‌తీమ‌ణి సునీత.. ఏపీలోని చంద్ర‌బాబు కేబినెట్‌లో కీల‌క‌మైన మంత్రిగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెతోపాటు ఆమె కుమారుడు ప‌రిటాల శ్రీరాం కూడా రంగంలోకి దిగే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ విష‌యంపై ఆమె టీడీపీ అధినేత చంద్ర‌బాబుతోనూ చ‌ర్చించిన‌ట్టు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు తీసుకునే నిర్ణ‌యంపై ఈ ఫ్యామిలీ ఫ్యూచ‌ర్ ఆదార‌ప‌డి ఉంటుంద‌ని చెబుతున్నారు.

రవి హత్య తర్వాత…..

టీడీపీలో ప్ర‌త్యేక ప్ర‌స్తానం సాగించిన ప‌రిటాల ర‌వి.. అన్న‌గారు ఎన్టీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా, స‌హ‌చ‌రుడుగా కూడా గుర్తింపు పొందారు. అయితే, అనూహ్య‌మైన కార‌ణాల నేప‌థ్యంలో 2005లో ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ నేప‌థ్యం లో ఆయ‌న స‌తీమ‌ణి.. సునీత్ రాజ‌కీయంగా అరంగేట్రం చేశారు. అప్ప‌టి ఉప ఎన్నిక‌ల్లో పెనుగొండ నుంచి ఆమె 16 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. 2009 ఎన్నిక‌ల్లో రాప్తాడు మారిన సునీత కేవ‌లం 1700 ఓట్ల‌తో నెట్టుకొచ్చారు. ఇక‌, 2014 విష‌యానికి వ‌స్తే.. రాప్తాడు నుంచే ఆమె పోటీ అయితే, ఈ ద‌ఫా 7 వేల ఓట్ల మెజారిటీతో ఆమె విజ‌యం సాధించారు. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డంతో ఆమెకు అనూహ్యంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అయితే, మ‌ధ్య‌లోనే ఆమె శాఖ‌ను మారాల్సి రావ‌డం మైన‌స్ అనేది కొంద‌రు విశ్లేష‌ణ‌.

శ్రీరామ్ ను పోటీ చేయించాలని….

ఇక‌, 2019 విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె త‌నతోపాటు కుమారుడు శ్రీరాంను కూడా రంగంలోకి దింపాల‌ని నిర్ణ యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే నియోజ‌వ‌ర్గాల వేట ప్రారంభమైంది. పెనుగొండ నుంచి శ్రీరాంను బ‌రిలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఇక్క‌డ బీసీ కోటాలో బీకే పార్థ‌సార‌ధి బ‌లంగా ఉన్నారు. దీంతో ఆయ‌న‌ను మారిస్తే.. ఇబ్బందేన‌ని పార్టీ భావిస్తోంది. దీంతో క‌ళ్యాణ‌దుర్గం సీటును కోరుతున్నారు. ఇక్క‌డ సిట్టింగ్ హ‌నుమంత‌రాయ చౌద‌రి వృద్ధుడు కావ‌డంతో ఆ సీటుపై క‌న్నేసిన సునీత‌, త‌న కుమారుడికి ఇప్పించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే, నేత‌ల మ‌నోగతం ఎలా ఉన్నా.. పార్టీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ఒక కుటుంబానికి ఒకసీటే అనే డిక్లేర్ చేస్తున్నారు.

వైసీపీ బలంగా ఉండటంతో…..

అలా కాద‌ని ప‌రిటాల కుటుంబంలో ఆమెకు, ఆమె త‌న‌యుడికి కూడా రెండు టికెట్లు ఇస్తే… ఇదే జిల్లా స‌హా క‌ర్నూలు, గుంటూరు, తూర్పుగోదావ‌రి జిల్లాల్లోని కీల‌క నాయ‌కులు కూడా ఇదేవిధంగా డిమాండ్ చేసే అవ‌కాశం ఉంది. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు ఏదో ఒక సీటే ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రోప‌క్క‌, రాప్తాడు నుంచి మ‌ళ్లీ సునీత‌కు టికెట్ ద‌క్కినా ఆమెకు గెలుపు అంత ఈజీకాద‌ని వినిపిస్తోంది. ఇక్క‌డ వైసీపీ నాయ‌కుడు తోపుదుర్తి బ‌లంగా ఉన్నారు. పైగా టీడీపీలో తీవ్ర అసంతృప్తి వ్య‌తిరేకంగా ప‌నిచేసే చాన్స్ ఉంద‌నితెలుస్తోంది. అయితే, గ‌త ఎన్నిక‌ల‌కు భిన్నంగా ఇక్క‌డ రాప్తాడులో సునీత చ‌మ‌టోడిస్తేనే త‌ప్ప గెలుపు గుర్రం ఎక్క‌డం సాధ్యం కాద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో 2019లో ప‌రిటాల ఫ్యామిలీ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఆస‌క్తిగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*